Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దురదృష్టం అంటే ఇదే.. ఊహించని రీతిలో ఔటైన వార్నర్ (Video)

లక్నో వేదికగా జరగుతున్న లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆసక్తికంగా సాగుతోంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిలకడగా పోరాడుతోంది. అయితే ఢిల్లీకి శుభారంభం లభించలేదు. నాలుగో ఓవర్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8; 9 బంతుల్లో) ఔటయ్యాడు.

అయితే బౌలర్ గొప్పతనంతో వార్నర్ పెవిలియన్‌కు చేరలేదు, దురదృష్టంతో అతను ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ వేసిన బంతిని ఫ్లిక్ షాట్‌తో వార్నర్ ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బాల్ కనెక్ట్ అవ్వలేదు. అతని ప్యాడ్లకు తగిలింది. అయితే అది వికెట్ల వైపుగా మెల్లగా కదిలింది. వెంటనే అప్రమత్తమైన వార్నర్ బ్యాటుతో దాన్ని ఆపాలని ప్రయత్నించాడు.

LSG vs DC Unfortunate Exit Warner s Unexpected Dismissal Leaves Fans Stunned

కానీ ఆ లోపే బంతి వికెట్లకు తాకింది. ఓ బెయిల్ కిందపడింది. దీంతో వార్నర్ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. అంతకుముందే వార్నర్ ఫిజియోతో తన వేలుకు చికిత్స చేయించుకున్నాడు. గాయంతో కూడా చెలరేగాలని పెయిన్ కిల్లర్ తీసుకుని మరీ, బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ దురృష్టం అతన్ని వెంటాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో నిలిచిన జట్టును ఒంటి చేత్తో ఆదుకున్నాడు. 94/7 స్కోరుతో ఉన్న లక్నో.. ఢిల్లీకి 168 రన్స్ టార్గెట్ ఇచ్చిందంటే ఆయుష్ పోరాటంతోనే.

లక్నో మూడో ఓవర్‌లోనే డికాక్ (19; 13 బంతుల్లో, 4x4) వికెట్ కోల్పోయింది. డికాక్‌ను, దేవదత్ పడిక్కల్‌ (3; 6 బంతుల్లో)ను ఖలీల్ అహ్మద్ స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేశాడు. అనంతరం బంతి అందుకున్న కుల్‌దీప్ లక్నోకు చుక్కలు చూపించాడు. స్టొయినిస్ (8; 10 బంతుల్లో, 1x4), నికోలస్ పూరన్ (డకౌట్), కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6)ను వరుసగా ఔట్ చేశాడు.

వికెట్ల వేటలో ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ కూడా చేరడంతో 14 ఓవర్లలో 94 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ ఆయుష్ బదోని ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. బౌండరీ, సిక్సర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

Story first published: Friday, April 12, 2024, 22:45 [IST]
Other articles published on Apr 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+