LSG vs DC Toss: ఢిల్లీదే బ్యాటింగ్.. జట్టులోకి వార్నర్.. 3 మార్పులతో బరిలోకి.. లక్నోలో ఒక మార్పు

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది.

లక్నో కెప్టెన్ ఏమన్నాడంటే..
''మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. అసలు కారణం ఏంటో ఆలోచించలేను కానీ ఇది తాజా వికెట్. అందుకే ముందుగా బాగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. వారిని తక్కువ స్కోర్‌కే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. మనీష్ పాండే ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో గౌతమ్ తుది జట్టులోకి వచ్చాడు. గతంలో గెలిచినా ఓడినా ఏం జరిగిందో మరిచిపోయి 100 శాతం ముందుకు వెళ్తాం. మైదానంలో వెళ్లి జట్టుగా మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ఇది అవకాశం.'' అని లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.

ఢిల్లీ కెప్టెన్ ఏమన్నాడంటే..
''టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనున్నాకున్నాం. ఎందుకంటే మేము ఇంతకు ముందు ఇక్కడ ఆడలేదు. ఈ మ్యాచ్‌లో మేము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. సీఫెర్ట్ స్థానంలో డేవిడ్ వార్నర్, ఖలీల్ స్థానంలో నోర్ట్జే , మన్‌దీప్ స్థానంలో సర్ఫరాజ్‌ఖాన్‌లు జట్టులోకి వచ్చారు. వార్నర్ మాకు అదనపు బలం. అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండడం మాకు మేలు చేస్తుంది.'' అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్టే
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications