LSG vs DC: గురువుకు తగ్గ శిష్యడు.. రిషబ్ పంత్ సూపర్ హెలికాప్టర్ షాట్.. నెట్టింట వైరల్

క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ పరిచయం చేసిన హెలికాప్టర్ షాట్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది అభిమానులు ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ల కోసమే మ్యాచ్‌లు చూసేవారంటే అతిశయోక్తి లేదు. అలాంటి హెలికాప్టర్ షాట్‌ను ఇతర క్రికెటర్లు కూడా పలు సందర్భాల్లో కొట్టడం మనం చూస్తుంటాం. తాజాగా లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా హెలికాప్టర్ షాట్ కొట్టాడు.

పంత్ హెలికాప్టర్ షాట్
ఆవేష్ ఖాన్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని రిషబ్ పంత్ అద్భుతంగా హెలికాప్టర్ షాట్ కొట్టాడు. హెలికాప్టర్ షాట్‌తో ఆ బంతిని పంత్ ఫోర్ బాదాడు. డీప్ మిడ్-వికెట్ మీదుగా ఆవేష్ ఖాన్ వేసిన 19వ ఓవర్ 3వ బంతిని రిషబ్ పంత్ హెలికాప్టర్ షాట్ రూపంలో ఫోర్ బాదాడు. పంత్ కొట్టిన ఈ హెలికాప్టర్ షాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పలువురు రిషబ్ పంత్‌ను గురువుకు తగ్గ శిష్యుడు అని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ధోనిని రిషబ్ పంత్ గురువుగా వ్యాఖ్యానిస్తారనే సంగతి తెలిసిందే.

అదరగొట్టిన పృథ్వీ షా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 67 పరుగులు జోడించారు. ఇందులో పృథ్వీ షానే 61 పరుగులు చేయడం గమనార్హం. మొదటి నుంచి ధాటిగా ఆడిన షా.. దాదాపు స్ట్రైకింగ్‌లో తానే ఉన్నాడు. ఈ క్రమంలో ఆవేష్ ఖాన్ వేసిన నాల్గో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. అనంతరం 30 బంతుల్లో ఐపీఎల్ కెరీర్లో 11వ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కృష్ణప్ప గౌతం వేసిన ఎనిమిదో ఓవర్లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీషా (61 రన్స్.. 9 ఫోర్లు, 2 సిక్సులు) ఔటయ్యాడు.

74 రన్స్‌కు 3 వికెట్లు
ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (4), రోవ్మాన్ పావెల్ (3) విఫలమవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. వీరిద్దరిని రవి బిష్ణోయ్ ఫెమిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో కెప్టెన్ రిషబ్ పంత్, సర్పరాజ్‌ఖాన్ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. కానీ ధాటిగా ఆడలేకపోవడంతో ఢిల్లీ భారీ స్కోర్ సాధించేలేకపోయింది. వీరిద్దరు 57 బంతుల్లో 75 పరుగులు మాత్రమే చేశారు.

చివరి 3 ఓవర్లలో 19 రన్సే
చివర్లో 3 ఓవర్లలో లక్నో బౌలర్లు ఆవేష్ ఖాన్, జేసన్ హోల్డర్ 19 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులకే పరిమితమైంది. ఇక రిషబ్ పంత్ (36 బంతుల్లో 39 రన్స్.. 3 ఫోర్లు, 2 సిక్సులు), సర్ఫరాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 రన్స్.. 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతం ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications