Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: భారీ ఇన్నింగ్స్‌తో డికాక్ విధ్వంసం.. ఢిల్లీపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం

LSG vs DC: Quinton de Kock (80) Played Big Inning and Lucknow Supergiants Beat by 6 Wickets Delhi Capitals
IPL 2022 DC Vs LSG Match Highlights | Oneindia Telugu

ఐపీఎల్ 2022లో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ జోరు కొన‌సాగుతుంది. తాజాగా ఆ జ‌ట్టు లీగ్‌లో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. మొద‌ట బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నో.. అనంత‌రం బ్యాటింగ్‌లో క్వింట‌న్ డికాక్(80) భారీ ఇన్నింగ్స్‌తో చెల‌రేగ‌డంతో 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. చివ‌ర్లో కాస్త ఉత్కంఠ నెల‌కొన్నప్ప‌టికీ కృనాల్ పాండ్యా, ఆయుష్ బ‌దోని మెరుపు ఇన్నింగ్స్‌తో విజ‌యాన్ని అందుకుంది.

 చెల‌రేగిన డికాక్‌

చెల‌రేగిన డికాక్‌

150 ప‌రుగుల మోస్త‌రు ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌కు ఓపెన‌ర్లు క్వింట‌న్ డికాక్, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 9.4 ఓవ‌ర్ల‌లో 73 ప‌రుగులు భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో కేఎల్ రాహుల్(24 ర‌న్న్‌, ఒక ఫోర్‌, ఒక సిక్సు)ను కుల్దీప్ యాద‌వ్ ఫెమిలియ‌న్ చేర్చాడు. అనంత‌రం క్వింట‌న్ డికాక్ ఐపీఎల్‌లో 18వ హాప్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత లలిత్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఎవిన్ లూయిస్ (5) ఔట‌య్యాడు. దీంతో 86 ప‌రుగులకు ల‌క్నో 2 వికెట్లు కోల్పోయింది.

చివ‌ర్లో ఉత్కంఠ‌

చివ‌ర్లో ఉత్కంఠ‌

ఈ క్ర‌మంలో మూడో వికెట్‌కు దీప‌క్ హుడాతో క‌లిసి క్వింట‌న్ డికాక్ 36 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. జ‌ట్టు స్కోర్ 122 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 80 ప‌రుగుల‌ వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో స‌ర్ఫ‌రాజ్‌ఖాన్‌కు మూడో వికెట్ రూపంలో దొరికిపోయాడు. 52 బంతులు ఎదుర్కొన్న డికాక్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అనంత‌రం దీప‌క్ హుడా, కృనాల్ పాండ్యా ల‌క్నో ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించారు. చివ‌రి 4 ఓవ‌ర్ల‌లో విజ‌యానికి 28 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో రెండు ఓవ‌ర్ల‌లో 9 ప‌రుగులే వ‌చ్చాయి. దీంతో చివ‌రి 2 ఓవ‌ర్ల‌లో 19 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. దీంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెల‌కొంది.

సిక్సుతో గెలిపించిన బ‌దోని

సిక్సుతో గెలిపించిన బ‌దోని

ఈ క్ర‌మంలో ముస్తిఫిజ‌ర్ ర‌హ్మాన్ వేసిన 19వ ఓవ‌ర్లో ఓ సిక్సు, 3 టుడీలు తీసిన కృనాల్ పాండ్యా 14 ప‌రుగులు రాబ‌ట్టాడు. దీంతో శార్దూల్ ఠాకూర్ వేసిన‌ చివ‌రి ఓవ‌ర్లో ల‌క్నో విజ‌యానికి 5 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా.. భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి తొలి బంతికే దీప‌క్ హుడా (11) ఔట‌య్యాడు. రెండో బంతి డాట్ కాగా మూడో బంతిని ఆయుష్ బ‌దోని ఫోర్ బాద‌డంతో మ్యాచ్ ల‌క్నో చేతిలోకి వెళ్లింది. ఇక నాల్గో బంతిని సిక్సు బాదడంతో మ‌రో 2 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘ‌న‌విజయం సాధించింది. కృనాల్ (19*), బ‌దోని (10*) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ 2, ల‌లిత్ యాద‌వ్, శార్ధూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీశారు.

 అద‌ర‌గొట్టిన పృథ్వీ షా

అద‌ర‌గొట్టిన పృథ్వీ షా

అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఓపెన‌ర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్న‌ర్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 7.3 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగులు జోడించారు. ఇందులో పృథ్వీ షానే 61 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. మొద‌టి నుంచి ధాటిగా ఆడిన షా.. దాదాపు స్ట్రైకింగ్‌లో తానే ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆవేష్ ఖాన్ వేసిన నాల్గో ఓవ‌ర్లో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. అనంత‌రం 30 బంతుల్లో ఐపీఎల్ కెరీర్లో 11వ హాఫ్ సెంచ‌రీ చేశాడు. అయితే కృష్ణ‌ప్ప గౌతం వేసిన ఎనిమిదో ఓవ‌ర్లో వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీషా (61 ర‌న్స్‌.. 9 ఫోర్లు, 2 సిక్సులు) ఔట‌య్యాడు.

 74 ర‌న్స్‌కు 3 వికెట్లు

74 ర‌న్స్‌కు 3 వికెట్లు

ఆ త‌ర్వాత డేవిడ్ వార్న‌ర్ (4), రోవ్మాన్ పావెల్ (3) విఫ‌ల‌మ‌వ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 74 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. వీరిద్ద‌రిని ర‌వి బిష్ణోయ్ ఫెమిలియ‌న్ చేర్చాడు. ఈ క్ర‌మంలో కెప్టెన్ రిష‌బ్ పంత్, స‌ర్ప‌రాజ్‌ఖాన్ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్ద‌రు నాల్గో వికెట్‌కు 75 ప‌రుగులు జోడించారు. కానీ ధాటిగా ఆడ‌లేక‌పోవడంతో ఢిల్లీ భారీ స్కోర్ సాధించేలేక‌పోయింది. వీరిద్ద‌రు 57 బంతుల్లో 75 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 19 ర‌న్సే

చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 19 ర‌న్సే

చివ‌ర్లో 3 ఓవ‌ర్ల‌లో ల‌క్నో బౌల‌ర్లు ఆవేష్ ఖాన్, జేస‌న్ హోల్డ‌ర్ 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చారు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇక రిష‌బ్ పంత్ (36 బంతుల్లో 39 ర‌న్స్‌.. 3 ఫోర్లు, 2 సిక్సులు), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (28 బంతుల్లో 36 ర‌న్స్‌.. 3 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచారు. లక్నో బౌల‌ర్ల‌లో ర‌వి బిష్ణోయ్ 2, కృష్ణ‌ప్ప గౌతం ఒక వికెట్ తీశారు.

స్కోర్లుs

ఢిల్లీ క్యాపిట‌ల్స్: 149-3

ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌: 155-4

Story first published: Thursday, April 7, 2022, 23:55 [IST]
Other articles published on Apr 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+