Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంపైర్‌తో పంత్ గొడవ..మండిపడ్డ గిల్‌క్రిస్ట్

ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టి తిరిగి గెలుపు బాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. కుల్‌దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (55; 35 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటాడు. అయితే లక్నో ఇన్నింగ్స్‌లో అంపైర్‌తో పంత్ వాగ్వాదానికి దిగాడు. రివ్యూ విషయంలో అంపైర్‌తో పంత్ చాలాసేపు తీవ్రంగా చర్చించాడు. ఈ ఘటనతో ఆట కాస్త ఆలస్యమైంది.

LSG vs DC Pant s Umpire Dispute Angers Gilchrist

అసలేం జరిగిదంటే..నాలుగో ఓవర్‌లో దేవదత్ పడిక్కల్‌కు ఇషాంత్ శర్మ వేసిన బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. పంత్ రివ్యూ కోరుతున్నట్లుగా టీ సైన్ చూపించాడు. కానీ ఆ సమయంలో పంత్ అంపైర్ వైపు చూడలేదు. మరోవైపు పంత్ సమీక్ష కోరినట్లుగా భావించిన అంపైర్లు రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌ను కోరారు. అయితే ఈ విషయం గందరగోళానికి గురిచేసింది. తాను రివ్యూ కోరలేదని అంపైర్‌తో పంత్ గొడవకు దిగాడని ఆ సమయంలో వ్యాఖ్యాతలు భావించారు.

కానీ ఆ తర్వాత కామెంటేటర్స్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వైడ్ కోసం కోరిన రివ్యూలో అంపైర్లు స్నికో మీటర్‌ను ఉపయోగించినందుకు పంత్ అసంతృప్తితో వాగ్వాదానికి దిగాడని అన్నారు. పంత్-అంపైర్ గొడవకు కారణం ఏదైనప్పటికీ ఢిల్లీ కెప్టెన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గిల్ క్రిస్ట్ మాత్రం మండిపడ్డాడు. అది ఏ ఫార్మాట్ అయినప్పటికీ అంపైర్ల నియంత్రణలో మ్యాచ్ ఉండాలని, ముందుకు తీసుకెళ్లేలా చూడాలని గిల్ క్రిస్ట్ అన్నాడు. పంత్ ఫిర్యాదు చేస్తున్నా లేదా ఇతర ప్లేయర్ కంప్లైట్ చేసినా, ఇది ముగిసిందని అంపైర్లు ఆటను కొనసాగించాలని తెలిపాడు. అప్పటికీ అతను అంతే మాట్లాడుతుంటే జరిమానా విధించాలని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 13, 2024, 9:08 [IST]
Other articles published on Apr 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+