Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: పృథ్వీ షా వీర బాదుడు.. బాల్ ప‌ట్టుకోవ‌డానికే భ‌య‌ప‌డిపోయిన హోల్డ‌ర్‌

LSG vs DC: Lucknow Super Giants fielder Jason Holder fails to catch the ball hit by Delhi Capitals opener Prithviraj Shah

ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ పృథ్వీ షా ఆడిన‌ ఓ క‌ట్ షాట్‌ను ఆల్ రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ ఆప‌డానికి భ‌య‌ప‌డ‌డం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంతేకాకుండా హోల్డ‌ర్‌కు ఏం జ‌రిగిందో అర్థ‌మ‌య్యే లోపే ఆ బంతి ఏకంగా బౌండ‌రీ లైన్ దాటేసింది.

హోల్డ‌ర్ మైండ్ బ్లాక్‌

హోల్డ‌ర్ మైండ్ బ్లాక్‌

ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్ కృష్ణ‌ప్ప గౌతం వేసిన రెండో ఓవ‌ర్ ఐదో బంతిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ పృథ్వీ షా అద్భుతంగా వికెట్ల వెనుక‌వైపుగా క‌ట్ షాట్ ఆడాడు. ఆ స‌మ‌యంలో స్లిప్‌లో జేస‌న్ హోల్డ‌ర్ ఫీల్డింగ్‌లో ఉన్నాడు. అయితే పృథ్వీషా ఆ బంతిని అద్భుతంగా క‌ట్ చేయ‌డంతో హోల్డ‌ర్ ప‌ట్టుకోలేక‌పోయాడు. కాస్త భ‌య‌ప‌డిపోయాడు. అలాగే ఆ బంతి వెనుక‌కు వ‌స్తుంటే బాల్ వైపు కాకుండా హోల్డ‌ర్ వేరే వైపు చూశాడు. ఒక ర‌కంగా ఆ స‌మ‌యంలో హోల్డ‌ర్ అంత అల‌ర్ట్‌గా కూడా క‌నిపించ‌లేదు. దీంతో హోల్డ‌ర్ చెవి ద‌గ్గ‌ర నుంచి ఆ బంతి వెళ్లింది. దీంతో హెల్డ‌ర్ బంతిని ప‌ట్టు్కోవ‌డానికి భ‌య‌ప‌డిన ఎక్స్‌ప్రేష‌న్స్ రికార్డు అయ్యాయి. కాగా పృథ్వీ షా కొట్టిన‌ ఆ సూప‌ర్ క‌ట్ షాట్‌పై అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

చెల‌రేగిన పృథ్వీ షా

చెల‌రేగిన పృథ్వీ షా

ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో పృథ్వీ షా చెల‌రేగాడు. క్రీజులో ఉన్నంత‌సేపు బౌండ‌రీల వ‌ర‌ద పారించాడు. అవ‌త‌ల వార్న‌ర్ ఉన్నాడ‌నే సంగ‌తి కూడా మ‌రిచిపోయి క్రీజులో ఉన్నంత సేపు దాదాపు అత‌నే స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. ఈ క్ర‌మంలో ఆవేష్ ఖాన్ వేసిన నాల్గో ఓవ‌ర్లో హ్యాట్రిక్ ఫోర్లు కూడా బాదాడు. మొత్తానికి 30 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో పృథ్వీషాకు ఇది 11వ హాఫ్ సెంచ‌రీ. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్సుల‌తో 61 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో కృష్ణ‌ప్ప గౌతమ్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా ఔట‌య్యాడు.

90 ప‌రుగులు షా వే

90 ప‌రుగులు షా వే

పృథ్వీ షా 7.3 ఓవ‌ర్ వ‌ద్ద ఔట‌వ్వ‌గా అప్ప‌టికీ ఢిల్లీ స్కోర్ 67 ప‌రుగులుగా ఉంది. అందులో పృథ్వీ షానే 61 ప‌రుగులు చేయ‌గా.. వార్న‌ర్ 4 ప‌రుగులే చేశాడు. దీంతో పృథ్వీషా క్రీజులో ఉన్నంత‌సేపు 90 శాతం ప‌రుగులు అత‌నే చేశాడ‌ని చెప్పుకోవ‌చ్చు.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్/ కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నార్టే

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

Story first published: Thursday, April 7, 2022, 21:00 [IST]
Other articles published on Apr 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+