Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుల్‌దీప్ మ్యాజికల్ డెలివరీ.. పూరన్ క్లీన్‌బౌల్డ్ (Video)

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ సత్తాచాటాడు. నాలుగు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. గాయంతో గత మూడు మ్యాచ్‌లకు దూరమైన కుల్‌దీప్ ఇవాళ మ్యాచ్‌తో తిరిగొచ్చాడు. తానెంతటి ప్రమాదకర బౌలర్ మరోసారి నిరూపించాడు.

ఏడో ఓవర్‌లో బంతి అందుకున్న కుల్‌దీప్ తన తొలి తొమ్మిది బంతుల్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. స్టొయినిస్ (8; 10 బంతుల్లో, 1x4), నికోలస్ పూరన్ (డకౌట్), కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6)ను వరుసగా ఔట్ చేశాడు. కుల్‌దీప్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్టొయినిస్ బ్యాకవర్డ్ పాయింట్‌లో ఇషాంత్‌కు దొరికాడు.

LSG vs DC Kuldeep s Magical Delivery Pooran Clean Bowled Video goes viral

అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్‌ను కుల్‌దీప్ మ్యాజికల్ డెలివరీతో డకౌట్ చేశాడు. పూరన్ ఢిపెన్స్‌ను ఛేదించుకుంటూ దూసుకెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో పూరన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే చక్కని బంతితో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కుల్‌దీప్ ఔట్ చేశాడు. రాహుల్ వికెట్‌కీపర్ పంత్ చేతికి చిక్కాడు.
కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో నిలిచిన జట్టును ఒంటి చేత్తో ఆదుకున్నాడు. 94/7 స్కోరుతో ఉన్న లక్నో.. ఢిల్లీకి 168 రన్స్ టార్గెట్ ఇచ్చిందంటే ఆయుష్ పోరాటంతోనే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో మూడో ఓవర్‌లోనే డికాక్ (19; 13 బంతుల్లో, 4x4) వికెట్ కోల్పోయింది. డికాక్‌ను, దేవదత్ పడిక్కల్‌ (3; 6 బంతుల్లో)ను ఖలీల్ అహ్మద్ స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేశాడు. అనంతరం బంతి అందుకున్న కుల్‌దీప్ లక్నోకు చుక్కలు చూపించాడు. వికెట్ల వేటలో ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ కూడా చేరడంతో 14 ఓవర్లలో 94 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయింది.

కానీ ఆయుష్ బదోని ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. బౌండరీ, సిక్సర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆయుష్‌కు అర్షద్ ఖాన్ (20*; 16 బంతుల్లో, 2x4) సహకరించాడు.కుల్‌దీప్ (3/20) మూడు, ఖలీల్ (2/41) రెండు వికెట్లు తీశారు.

Story first published: Friday, April 12, 2024, 22:25 [IST]
Other articles published on Apr 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+