Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG VS DC: సంజీవ్ గోయెంకా చెంప చెళ్లుమనిపించిన కేఎల్ రాహుల్..! (వీడియో)

Goenka VS KL Rahul: ఐపీఎల్ 2025లో మంచి ప్రదర్శన కనబరుస్తోన్న దిల్లీ క్యాపిటల్స్‌.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకెళ్తోన్న ఆ జట్టు.. ఆరో విజయాన్ని అందుకుంది. బ్యాటుతో, బంతితో ఆల్ రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దిల్లీ జట్టు.. లక్నో జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించింది. విజయంలో.. బౌలింగ్‌తో ముకేశ్, హాఫ్ సెంచరీలతో కేఎల్‌ రాహుల్, అభిషేక్‌ పోరెల్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత లక్నో (ఎల్‌ఎస్‌జీ) యజమాని సంజీవ్ గోయెంకా చెంప చెళ్లుమనిపించాడు దిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే?
గత సీజన్‌లో కేఎల్ రాహుల్.. లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేఎల్ రాహుల్ తన ప్రదర్శనతో నిరాశపరిచాడు. లక్నో జట్టు కూడా తడబడింది. దీంతో తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు సంజీవ్ గోయెంకా. దీంతో ఓ సారథిని అలా పబ్లిక్‌గా నిలదీయడంపై గోయెంకాపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ గోయెంకా తన తీరును మార్చుకోలేదు. రాహుల్ ను వదిలేసి, పంతానికి పోయీ 2025 సీజన్ లో పంత్ ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసి తన లక్నో జట్టుకు కెప్టెన్ చేశాడు. కానీ పంత్, మరీ దారుణంగా నిరాశ పరిచాడు. ప్రతీ మ్యాచులోనూ దారుణ ప్రదర్శన చేశాడు.

LSG VS DC KL Rahul Ignores Sanjiv Goenka Hand Shake Video Goes Viral in IPL 2025

తాజాగా జరిగిన దిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచులోనూ పంత్ ముకేశ్ కుమార్ బౌలింగ్ లో 0 పరుగులకు వెనుదిరిగాడు. పైగా ఇదే మ్యాచులో కేఎల్ రాహుల్ (57 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4, 3×6) తన అద్భుత హాఫ్ సెంచరీతో దిల్లీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో కేఎల్ రాహుల్ పై ప్రశంసలు కురిశాయి.

ఈ క్రమంలోనే మ్యాచ్ విజయం తర్వాత కేఎల్ రాహుల్ ను ఆటగాళ్లందరూ ప్రశంసిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలానే లక్నో ఓనర్ గోయెంకా, అతడు కొడుకు కూడా రాహుల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆపై అతడిని ఆపి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్ మాత్రం.. షేక్ హ్యాండ్ ఇస్తూనే వాళ్ల మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కనీసం వాళ్లవైపు కూడా తిరిగి చూడలేదు. దీంతో గోయెంకా, అతడు కొడుకు.. ముఖం మాడిపోయింది! ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. 'గోయెంకా తిక్క కుదిరింది', 'చెంప చెళ్లుమనిపించాడు', 'సరైన గుణపాఠం చెప్పాడు', 'సంజీవ్ తన పరువును కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే, కేఎల్ రాహుల్ ఆయన అస్సలు పట్టించుకోకుండా వెళ్లాడు', 'అవమానిస్తే ఎవడైనా ఇలానే చేస్తాడు', 'గోయెంకాకు బుద్ధి బాగా చెప్పాడు'.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, April 23, 2025, 7:54 [IST]
Other articles published on Apr 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+