Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: కొత్త కుర్రాడు కుమ్మేశాడు.. ఢిల్లీ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని (55*; 35 బంతుల్లో, 5x4, 4x6) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. కుల్‌దీప్ యాదవ్ (3/20) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అరంగేట్ర విదేశీ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (55; 35 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో, 4x4, 2x6) సత్తాచాటాడు.

dc win

ఛేదనలో ఢిల్లీకి శుభారంభం లభించలేదు. నాలుగో ఓవర్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8; 9 బంతుల్లో, ) దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్‌కు ట్రై చేసి బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జేక్ ఫ్రేజర్ దూకుడుగా ఆడాడు. పృథ్వీ షా (32; 22 బంతుల్లో, 6x4) కూడా సహకరించడంతో ఢిల్లీ పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది.

పృథ్వీ షాను ఏడో ఓవర్‌లో రవి బిష్ణోయ్ ఔట్ చేయడంతో క్రీజులోకి పంత్ వచ్చాడు. అనంతరం ఢిల్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పంత్, ఫ్రేజర్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఫ్రేజర్ 31 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత స్పల్ప వ్యవధిలోనే ఫ్రేజర్, పంత్ ఔటయ్యారు. అప్పటికీ ఢిల్లీ విజయం దాదాపు ఖరారైంది. ట్రిస్టన్ స్టబ్స్ (15*; 9 బంతుల్లో, 1x6), షై హోప్ (11*; 10 బంతుల్లో, 1x4) మిగిలిన పనిని పూర్తిచేశారు.

అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో మూడో ఓవర్‌లోనే డికాక్ (19; 13 బంతుల్లో, 4x4) వికెట్ కోల్పోయింది. డికాక్‌ను, దేవదత్ పడిక్కల్‌ (3; 6 బంతుల్లో)ను ఖలీల్ అహ్మద్ స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేశాడు. అనంతరం బంతి అందుకున్న కుల్‌దీప్ లక్నోకు చుక్కలు చూపించాడు. తాను సంధించిన తొలి తొమ్మిది బంతుల్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. స్టొయినిస్ (8; 10 బంతుల్లో, 1x4), నికోలస్ పూరన్ (డకౌట్), కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో, 5x4, 1x6)ను వరుసగా ఔట్ చేశాడు.

వికెట్ల వేటలో ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ కూడా చేరడంతో 14 ఓవర్లలో 94 పరుగులకే లక్నో సూపర్ జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ ఆయుష్ బదోని ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. బౌండరీ, సిక్సర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆయుష్‌కు అర్షద్ ఖాన్ (20*; 16 బంతుల్లో, 2x4) సహకరించాడు.

Story first published: Friday, April 12, 2024, 23:22 [IST]
Other articles published on Apr 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+