అందుకే నేను ఇప్పటివరకు సరిగ్గా బౌలింగ్ చేయలా: అక్షర్ పటేల్
Axar Patel: దిల్లీ క్యాపిటల్స్ మరోసారి సత్తా చాటింది. ఏకపక్షంగా సాగిన తాజా మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. ముకేశ్ (4/33) అదిరే ప్రదర్శన చేయడంతో మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో 159/6కే కుప్పకూలింది. మార్‌క్రమ్ (33 బంతుల్లో 52; 2×4, 3×6), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 45; 3×4, 1×6), బదోని ( 21 బంతుల్లో 36; 6×4) పరుగులు చేశారు. ముకేశ్ తో పాటు స్టార్క్ (1/25), చమీర (1/25), అక్షర్ (0/29) ఎల్‌ఎస్‌జీని కట్టడి చేశారు.
లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3×4, 3×6), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51; 5×4, 1×6), అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1×4, 4×6) అద్భుతంగా రాణించడంతో.. 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది దిల్లీ. కాగా, 8 మ్యాచుల్లో దిల్లీ క్యాపిటల్స్ కు ఇది ఆరో విజయం. 9 మ్యాచులు ఆడిన లక్నోకు ఇది నాలుగో ఓటమి.

మ్యాచ్ అనంతరం... "బౌలింగ్‌తో మేం ప్రారంభించిన తీరు బాగుంది. వికెట్లు పడకపోయినా, మేము గేమ్‌ను కంట్రోల్‌లో ఉంచగలిగాం. రెండు వికెట్లు వరుసగా తీసిన తర్వాత గేమ్ లో మూమెంటం వచ్చింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని 160 కన్నా తక్కువ పరుగులకే కట్టడి చేశారు. నాకు చిన్న గాయం ఉంది. అందుకే ఇప్పటివరకు ఎక్కువగా బౌలింగ్ చేయలేకపోయాను. ఒకవేళ నా నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేస్తే, మ్యాచులకు దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ ఈరోజు మంచి రిథమ్‌లో ఉన్నానని అనిపించింది, అందుకే ముందుగానే బౌలింగ్‌కు వచ్చాను. బౌలింగ్ మార్పులు చేసేటప్పుడు మ్యాచ్-అప్స్‌ను పరిగణలోకి తీసుకున్నాను. అందుకే బౌలర్లను రొటేట్ చేస్తూ ఆడించాను. వాళ్లందరూ పరిస్థితికి తగ్గట్టుగా బాగా బౌలింగ్ చేశారు."
"నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడల్లా నా బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడతాను. ఏ స్థానంలో ఆడుతున్నా అనేది పట్టించుకోను. ఒక బౌలర్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడల్లా నాకు మంచి ఫలితాలే వచ్చాయి. ఫీల్డింగ్‌లో మేము ఇంకా కాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదులితే అది గేమ్‌పై ప్రభావం చూపించొచ్చు." అని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications