సీఎస్కే కొంపముంచిన లక్నో.. ప్లేఆఫ్స్ రేసులో ఊహించని ట్విస్ట్!
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన కీలకపోరులో సీఎస్కేపై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ
మ్యాచ్‌లో లక్నో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, సీఎస్కే ప్లేఆఫ్స్ ఆశలను దెబ్బతీసింది.సీఎస్కే నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు కేవలం 16.4 ఓవర్లలోనే ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మిచెల్ మార్ష్ మెరుపు ఇన్నింగ్స్
లక్నో విజయంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం 38 బంతుల్లోనే 236.84 స్ట్రైక్ రేట్‌తో 90 పరుగులు బాదాడు. మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ రనౌట్ కావడంతో ఈ సీజన్‌లో తన రెండో సెంచరీని కేవలం 10 పరుగుల దూరంలో మిస్ చేసుకున్నాడు. మార్ష్‌కు తోడుగా జోష్ ఇంగ్లిస్ 36 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి తలో వికెట్ పడగొట్టినప్పటికీ లక్నో జోరును అడ్డుకోలేకపోయారు.

చెన్నై ప్లేఆఫ్స్ సమీకరణాలు
ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్ల వద్ద నిలిచింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే సీఎస్కే తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి. అప్పుడు జట్టుకు 16 పాయింట్లు వస్తాయి. అయితే ఇది మాత్రమే సరిపోదు. పంజాబ్, హైదరాబాద్ జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాలని చెన్నై కోరుకోవాలి. ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్ జట్లు 16 పాయింట్లతో ముందంజలో ఉండటంతో సీఎస్కేకు దారులు క్లిష్టమయ్యాయి.
మ్యాచ్ హైలైట్స్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే, యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (71 పరుగులు, 42 బంతులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 187 పరుగులు చేయగలిగింది. ఆరంభంలో సంజు శాంసన్ (20), రుతురాజ్ గైక్వాడ్ (9) విఫలమైనప్పటికీ.. కార్తీక్, బ్రెవిస్ (25) నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో శివమ్ దూబే 16 బంతుల్లో 32 పరుగులు చేసి స్కోరును 187కు చేర్చాడు. లక్నో బౌలర్లలో ఆకాష్ మహరాజ్ సింగ్ 3 వికెట్లతో చెన్నైని కట్టడి చేశాడు. చివరకు మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications