Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : కొత్త సీజన్‌లో కొత్త జెర్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ న్యూ జెర్సీ లుక్స్ అదుర్స్!

LSG unveils new jersey for the IPL 2023

ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్స్‌లో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) సరికొత్త జెర్సీని లాంచ్ చేసింది. గతేడాది తొలిసారి ఐపీఎల్ ఆడిన ఈ జట్టు నాకౌట్స్ చేరిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సారధ్యంలోని ఈ జట్టు.. గతేడాది తమ తొలి సీజన్‌లో నాకౌట్స్ చేరింది. అయితే ఎలిమినేటర్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమితో సీజన్‌ను ముగించింది.

కొత్త సీజన్ కోసం కొత్తగా..

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో ఈ జట్టు కొత్తగా కనిపించనుంది. ఎందుకంటే కొత్త సీజన్‌లో తాము కొత్త జెర్సీతో కనపడతామని ఎల్‌ఎస్‌జీ తెలిపింది. ఈ జెర్సీ విడుదల కార్యక్రమంలో ఫ్యాషన్ షో కూడా నిర్వహించింది.

ఈ టీమ్‌లోని స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవి బిష్ణోయి, జయదేవ్ ఉనద్కత్, దీపక్ హుడా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానుల మధ్య ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలో కొత్త జెర్సీని విడుదల చేశారు.

కొత్త జెర్సీ ఎలా ఉందంటే?

కొత్త జెర్సీ ఎలా ఉందంటే?

బీసీసీఐ సెక్రటరీ జై షా, ఎల్‌ఎస్‌జీ టీ యజమాని సంజీవ్ గోయెంకా, టీం మెంటార్ గౌతమ్ గంభీర్ కూడా ఈ కొత్త జెర్సీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ టీం పాత జెర్సీ గ్రీన్ కలర్‌లో ఉండేది. కొత్త జెర్సీ డార్క్ బ్లూ కలర్‌లో ఉండనుంది. దీనిపై రెండు పక్కలా ఎర్రని గీతలతో ఆకర్షణీయంగా ఉందీ జెర్సీ. ఈ కొత్త జెర్సీతో తమ జట్టు అదృష్టం కూడా మారుతుందని, గతేడాది గుజరాత్ కొట్టినట్లే తాము కూడా ట్రోఫీ కొట్టాలని ఎల్‌ఎస్‌జీ ఆశిస్తోంది.

ఈ టీంను సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌ఎస్‌పీజీ సంస్థం ఏకంగా రూ.7090 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టు సారధిగా ఉన్న రాహుల్‌ను రూ.17 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

టార్గెట్ అదేనన్న గంభీర్..

తమ జట్టు లక్ష్యం నిలకడగా రాణించడమే అని, ఎక్కడ ఆడుతున్నా సరే అదే తమ టార్గెట్ అని ఎల్‌ఎస్‌జీ మెంటార్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. గతేడాది కరోనా భయంతో పరిమిత వేదికల్లో జరిగిన ఈ టోర్నీ.. ఈ ఏడాది మళ్లీ పాత విధానంలో దేశమంతటా జరుగుతుంది. ప్రతి జట్టు హోం, ఎవే గేమ్స్ ఆడుతుంది.

ఈ క్రమంలో తాము జైపూర్, చెన్నై ఎక్కడకు వెళ్లినా సరే నిలకడగా ఆడటానికే ప్రాధాన్యం ఇస్తామని గంభీర్ చెప్పాడు. ఆయా పరిస్థితులకు త్వరగా అలవాటు పడాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే విజయాలు దక్కుతాయని అభిప్రాయపడ్డాడు.

Story first published: Tuesday, March 7, 2023, 15:22 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+