LSG playing 11 vs DC : స్టాయినిస్ ఔట్, కైల్ మేయర్స్ ఇన్.. లక్నో వర్సెస్ ఢిల్లీ తుది జట్లు ఇవే..!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నేడు మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ జరగనుంది. ఢిల్లీకి ఇది చాలా కీలకమైన మ్యాచ్. లక్నో కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఇకపోతే లక్నో సూపర్ జెయింట్స్ టీం ఐపీఎల్-2022 సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు లక్నో టీం ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. జట్టులో బౌలర్లు, బ్యాటర్లు బాగా రాణిస్తుండడం లక్నోకు కలిసొస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై లక్నో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో క్వింటన్ డికాక్ (53), దీపక్ హుడా (46) పరుగులతో రాణించడంతో 153పరుగులు చేసింది. ఇది లో స్కోర్ అయినప్పటికీ.. ఎల్ఎస్‌జీ బౌలర్లు డిఫెండ్ చేయగలిగారు. లక్నో బౌలర్లలో యువ ఆటగాడు మొహ్సిన్ ఖాన్ 3వికెట్లతో సత్తా చాటగా.. కృనాల్ పాండ్యా, దుష్మంత చమీరా చెరో రెండు వికెట్లు సాధించి కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో 133పరుగులకే పంజాబ్ చాప చుట్టేసింది.

దాదాపు అందరూ బౌలింగ్ చేయగలరు
లక్నో బౌలింగ్ యూనిట్ పటిష్ఠంగా కన్పిస్తోంది. లక్నోలో కేఎల్ రాహుల్, డికాక్ మినహా అందరూ బౌలింగ్ చేయగల సమర్థులే. ముఖ్యంగా దుష్మంత్ చమీరా, మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, కే.పాండ్యా.. రాణిస్తున్నారు. ఇక ఆల్రౌండర్ స్టాయినిస్ మాత్రం నిరాశపర్చుతున్నాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 73పరుగులే చేశాడు. దీంతో అతని స్థానంలో కైల్ మేయర్స్‌ను తీసుకునే అవకాశం ఉంది.

రేసులో నిలవాలంటే ఢిల్లీ గెలవాల్సిందే
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది తొమ్మిదో మ్యాచ్. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. ప్రతి గేమ్ గెలవాల్సిన పరిస్థితి. ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 8పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఓడించిన ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచి 10పాయింట్లు సాధించాలని చూస్తోంది. ఢిల్లీ ప్లేయర్లలో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, కెప్టెన్ పంత్ మినహా.. దాదాపు అందరూ బౌలింగ్ చేయగలర సమర్థులే. కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి కలిసొస్తుంది. ఇక ముస్తాఫిజుర్, చేతన్ సకారియా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగల సమర్థులే.

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్ ( వికెట్ కీపర్ ), కేఎల్ రాహుల్ (కెప్టెన్ ), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications