Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH VS LSG: సంజీవ్ గోయెంకా యూటర్న్..!!

Lucknow Super Giants: సంజీవ్ గోయెంకా.. ఈ పేరు గతేడాది నుంచి ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తరచుగా ఈ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందుకు కారణం ఆయన ఆటగాళ్లతో ప్రవర్తించిన తీరే. సాధారణంగా ఫ్రాంఛైజీ యజమానులు లేదా జట్టుకు సంబంధించిన ఇంకెవరైనా.. తమ ఆటగాళ్లు ఓడితే వారికి అండగా నిలవడం, ప్రోత్సాహించడం వంటి చేస్తుంటారు. అప్పుడు వాళ్ల మధ్య సత్స సంబంధాలు, ఆటగాళ్లు తమ తర్వాతి మ్యాచుల్లో మరింతగా రాణించడం జరుగుతుంది. కానీ సంజీవ్ గోయెంకా మాత్రం అలా చేయలేదు.

రీసెంట్ గా దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు ఓడింది. ఆ మ్యాచులో కెప్టెన్ పంత్ కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. రూ.27 కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన పంత్.. డకౌట్ గా వెనుదిరగడం, జట్టు ఓడిపోవడం చూసి గోయెంకా మొన్న మైదానంలో అసంతృప్తిగా కనిపించారు. పంత్ తో ఏదో చర్చిస్తున్నట్లుగా కనిపించారు. దీంతో ఆయన పంత్ తోనూ కాస్త హార్డ్ గా మాట్లాడారేమోనని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. ఎందుకంటే గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో లక్నో ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు ఓనర్ సంజీవ్ గోయెంకా - కెప్టెన్‌ కేఎల్ రాహుల్ తో కాస్త దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత రాహుల్ జట్టును వీడటం పంత్ రావడం జరిగిపోయింది. దీంతో సంజీవ్ గోయెంకా నెట్టింట తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

LSG owner Sanjiv Goenka Tight Hug with Rishabh Pant After LSG Win against SRH ipl 2025

అయితే ఇప్పుడు తాజాగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ను ఓడించింది లక్నో. ఈ సీజన్ మొదటి మ్యాచులో ఓడినప్పటికీ రెండో మ్యాచులో గెలిచింది. కానీ పంత్ మాత్రం కాస్త నిరాశపరిచాడు. అయినా కూడా సంజీవ్ గోయెంకా మ్యాచ్ అనంతరం.. జట్టు గెలిచిన ఆనందంలో మునిగితేలారు. పంత్ తో నవ్వుతూనే మాట్లాడుతూ కనిపించారు. పంత్ ను ఒక్క మాట కూడా అనలేదు. పంత్‌ను గట్టిగా హగ్‌ చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలానే మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు జట్టును ఉత్సాహపరిచారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

Story first published: Friday, March 28, 2025, 9:50 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+