లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఆ ఫ్రాంజైజీ యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగా అవమానించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం అనంతరం మైదానంలోనే రాహుల్‌పై సంజీవ్ విరుచుకుపడ్డాడు. రాహుల్‌తో ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు.
ఈ సంఘటన తీవ్ర చర్చనీయాశంగా మారింది. కెప్టెన్‌తో అమర్యాదగా ప్రవర్తించడమేంటని లక్నో ఫ్రాంచైజీపై భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, మహ్మద్ షమి వంటి ఆటగాళ్లు రాహుల్‌కు అండగా నిలుస్తూ సంజీవ్ ప్రవర్తన తీవ్రంగా తప్పుబట్టారు. జట్టు సారథికి గౌరవం ఇవ్వాలని, ఏదైనా చర్చించాలనుకుంటే డ్రెస్సింగ్ రూమ్ లేదా నాలుగు గోడల మధ్యన చేయాలని అన్నారు.

మరోవైపు ఈ సంఘటనతో కేఎల్ రాహుల్ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. గత రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్ చేర్చిన విషయాన్ని మరిచి, ఓ పరాజయం గురించి అమర్యాదగా యజమాని ప్రవర్తించిన తీరుపై రాహుల్ చాలా బాధపడ్డాడని, దీంతో ఈ సీజన్ ముగిసిన అనంతరం లక్నో ఫ్రాంచైజీకి రాహుల్ గుడ్‌బై పలకనున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి.
అంతేగాక తన సొంత రాష్ట్ర టీమ్ అయిన ఆర్సీబీ తరఫున కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడని కథనాలు వెల్లువెత్తాయి. డుప్లెసిస్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలు రాహుల్‌కు అందివ్వాలని బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందని మీడియాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా దారికొచ్చాడు. లక్నో జట్టును వీడకుండా కేఎల్ రాహుల్‌ను బుజ్జగించే పనులు మొదలుపెట్టాడు.

సోమవారం రాత్రి తన ఇంటికి కేఎల్ రాహుల్‌ను సంజీవ్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. రాహుల్‌తో కలిసి భోజనం చేశాడు. మొత్తంగా మైదానంలో తాను చేసిన తప్పును సరిద్దుకోవడానికి సంజీవ్ తీవ్రంగానే ప్రయత్నాలు చేశాడు. మరి రాహుల్ లక్నో ఫ్రాంచైజీతో వచ్చే సీజన్‌లో కొనసాగుతాడా లేదా మెగా వేలంలో బరిలోకి దిగుతాడా అని తెలియాలంటే మరికొన్ని నెలలు ఎదురుచూడాల్సిందే.