సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన IPL 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అంతకు ముందు లక్నో కెప్టెన్ గా చేసిన కేఎల్ రాహుల్ మాత్రం రిటైన్ చేసుకోలేదు. రాహుల్ ను రూ.14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్ కొనుగోలు చేసింది. కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ బయటకు వచ్చి వేలంలో పాల్గొన్నాడు. తాజాగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కలిసి ఉన్న ఫొటోతో సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో LSG 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత KL రాహుల్ ను బహిరంగంగా దూషిస్తూ కెమెరాకు చిక్కిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తున్నాయి. . సంజీవ్ గోయెంకా ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత సమాధానం ఇచ్చారు. ఈ సంఘటన కేఎల్ రాహుల్, తన మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసిందన్నారు. అంతిమంగా, లక్నో జట్టు 2025 సీజన్‌కు ముందు తమ కెప్టెన్‌ని కొనసాగించకూడదని ఎంచుకుందవు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

మెగా వేలంలో అతని కోసం వారి RTM కార్డును ఉపయోగించకూడదని నిర్ణయించుకుందని మీమ్స్ లో పేర్కొన్నారు. దీనిపై లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యజమాని సంజీవ్ గోయెంకా స్పందించారు. "సరే, నేను మీమ్‌ని చూడలేదు, కానీ నేను ఇంత చెప్పగలను. బాస్ ప్రేమగలవాడు, శ్రద్ధగలవాడు. అవును, కఠినమైనవాడు కూడా. ప్రేమ అవసరమైనప్పుడు, అతను ప్రేమను ఇస్తాడు, సంరక్షణ అవసరమైనప్పుడు శ్రద్ధ చూపుతాడు. కొంచెం తిట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు తిడతాడు" అని గోయెంకా పేర్కొన్నాడు.
టైమ్స్ నౌలో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా గోయెంకా పే వ్యాఖ్యలు చేశాడు. ఎల్ఎస్జీ రిషబ్ పంత్‌తో పాటు, నికోలస్ పూరన్ కూడా భారీ మొత్తం వెచ్చించింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ ను ఎక్కువ డబ్బులు పెట్టి కొనడంపై సంజీవ్ గోయెంకా స్పందించారు. జట్టుకు ప్రధామైన ఆటగాడు అవసరమని అందుకే పంత్ తీసుకున్నట్లు వివరించాడు. ఇది ఒక వ్యక్తిగత ఆటగాడికి సంబంధించినది కాదన్నారు. అలాగే ఇది అహంకారానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు.