కోహ్లీ కాళ్లు మొక్కిన లక్నో బౌలర్.. కింగ్ రియాక్షన్ చూశారా? (వీడియో)
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అభిమానులే కాదు, యువ క్రికెటర్లు కూడా కింగ్ కోహ్లీని ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026లో ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో యువ పేసర్ నమన్ తివారీ విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కి తన గౌరవాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
కోహ్లీ పాదాలకు నమస్కరించిన యువ ప్లేయర్
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు పలకరించుకుంటున్న సమయంలో 20 ఏళ్ల నమన్ తివారీ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లాడు. నమన్ తివారీతో మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా వంగ కోహ్లీ పాదాలకు నమస్కారం చేశాడు. భారత్‌లో పెద్దల పట్ల గౌరవాన్ని, ఆశీస్సులను కోరుతూ చేసే ఈ సంప్రదాయ పద్ధతిని నమన్ తివారీ అనుసరించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ కూడా నమన్ తివారీ చేసిన ఈ పనికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే చిరునవ్వు చిందిస్తూ నమన్‌ను పైకి లేపి అతడిని అభినందించాడు.

తన అభిమానాన్ని చాటుకున్న నమన్ తివారీ
యువ క్రికెటర్లకు ఐపీఎల్ అనేది కేవలం ఓ టోర్నమెంట్ మాత్రమే కాదు, కోహ్లీ వంటి మేటి ప్లేయర్ల నుంచి నేర్చుకునే ఓ గొప్ప వేదిక. నమన్ తివారీ గతేడాది అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ తరఫున అద్భుతంగా రాణించాడు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను లక్నో జట్టు గత వేలంలో రూ. 1 కోటికి దక్కించుకుంది. తన రోల్ మోడల్‌ను కలిసిన ఉత్సాహంలో నమన్ ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు.
విశ్వరూపం చూపించిన కోహ్లీ
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దిగాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం తన విశ్వరూపం చూపించాడు. లక్నో నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ 34 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం ఒక పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంలో కోహ్లీ ఇన్నింగ్స్ ఎంతో దోహదపడింది. గ్యాలరీలో ఉన్న అభిమానులు కూడా కోహ్లీ-నమన్ తివారీ మధ్య జరిగిన ఈ మధుర ఘట్టాన్ని చూసి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications