నేను షేన్ వార్న్ స్నేహితుడిని కాబట్టే ఆసీస్ నన్ను స్లెడ్జ్ చేయలేదు: 'గప్‌చుప్' చాట్ షోలో కుంబ్లే

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా ఆటగాళ్ల మధ్య స్లెడ్లింగ్ అనేది సర్వసాధారణం. అయితే, తాను ఆడిన రోజుల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పుడు స్లెడ్జింగ్ చేయలేదని టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2020 సీజన్ కోసం అనిల్ కుంబ్లేని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన 'గప్‌చుప్' చాట్ షోకి ఇచ్చిన ఇంటర్యూలో షేన్ వార్న్, తాను మంచి స్నేహితులం కాబట్టి ఎప్పుడూ ఆసీస్ జట్టు తనను స్లెడ్జ్ చేయలేదని కుంబ్లే తెలిపాడు.

కుంబ్లే మాట్లాడుతూ
ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ "నాకు సరిగా గుర్తు లేదు. నేను ఏమి విన్నానంటే 'షేన్ వార్న్ స్నేహితుడివి కాబట్టి నిన్ను ఎప్పటికీ స్లెడ్జ్ చేయలేరు' అని" అని తెలిపాడు. ఏ జట్టుకు బౌలింగ్ వేయడాన్ని మీరు అమితంగా ఇష్టపడ్డారు అని అడిగిన ప్రశ్నకు గాను కుంబ్లే తనదైన శైలిలో స్పందించాడు.

బౌలింగ్ చేయడం ఓ సవాల్
"బౌలర్‌గా ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయాలనుకుంటారు. ఇది ఒక సవాల్ (ప్రతి జట్టుకు వ్యతిరేకంగా బౌలింగ్). అయితే, ఆస్ట్రేలియాపై బౌలింగ్‌ని (నేను చాలా ఇష్టపడ్డాను). ఎందుకంటే ఆ సమయంలో వారు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ జట్టు. ఉత్తమమైన జట్టుకు వ్యతిరేకంగా మీరు ఏమి చేయగలరో మీరు ఏమి సాధించవచ్చో ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలనుకుంటున్నారు" అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.
ఆసీస్‌కు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు
"నేను కూడా దానిని ఓ సవాల్‌గా తీసుకున్నాను. ఆసీస్‌కు వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేయడం చాలా అద్భుతంగా ఉంది. అదృష్టవశాత్తూ నేను సచిన్ టెండూల్కర్, ఒక వీరేంద్ర సెహ్వాగ్ లేదా వీవీఎస్ లక్ష్మణ్ లేదా రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీపై బౌలింగ్ గురించి ఆందోళన చెందలేదు. ఎందుకంటే వాళ్లు నా జట్టులోనే ఉన్నారు" అని కుంబ్లే తెలిపాడు.

జంబో అని పేరు ఎవరు పెట్టారంటే!
అనిల్ కుంబ్లేని తన సహచర క్రికెటర్లు ముద్దుగా 'జంబో' అని పిలిచే సంగతి తెలిసిందే. ఈ పేరుని ఎవరు పెట్టారని ప్రశ్నకు గాను నవజ్యోత్ సింగ్ సిద్ధు అని కుంబ్లే తెలిపాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో ముగ్గురు ఫన్నీగా ఉండే క్రికెటర్ల ఎవరన్న ప్రశ్నకు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, వినోద్ కాంబ్లీ అని సమాధానమిచ్చాడు. రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్‌లో సీరియస్‌గా ఉంటూ సమతుల్యతను కాపాడుకునే వాడని అనిల్ కుంబ్లే తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications