Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీరలో షమీ కుమార్తె, చూస్తుంటే ముద్దొస్తున్నావ్ తల్లి అంటూ కామెంట్

 Love You So Much: Mohammed Shami Showers Love On Daughters Adorable Saree Picture

హైదరాబాద్: టీమిండియా పేసర్ మహ్మద్‌ షమీ తన ముద్దులు కుమార్తెను చూసి తెగ మురిసిపోతున్నాడు. గురువారం సరస్వతి పూజ అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షమీ కుమార్తె బాగా చదువు రావాలని సరస్వతి పూజ చేసింది. ఈ సందర్భంగా చిన్నారి ఐరా పసుపు రంగు చీరను ధరించింది.

ఈ సందర్భంగా తీసిన ఫోటోను నాన్నకు షేర్‌ చేసింది. తన కుమార్తెను చీరలో చూసిన ఆనందంలో ఆ ఫోటోని అభిమానులతో పంచుకోవాలని అనిపించింది ఏమో తెలియదు గానీ... వెంటనే ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "చీరలో చాలా అందంగా కనపడుతున్నావు, చూస్తుంటే ముద్దొస్తున్నావ్ తల్లి... నిన్ను చాలా మిస్సవుతున్నా.. త్వరలోనే నిన్ను కలుస్తా" అంటూ కామెంట్ పెట్టాడు.

కాగా, ప్రసుత్తం షమీ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ఐదు టీ20ల సిరిస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే టీమిండియా 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది.

కివీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైన దశలో చివరి బంతికి రాస్‌ టేలర్‌ను బౌల్డ్‌ చేసి న్యూజిలాండ్‌ గెలవాల్సిన మ్యాచ్‌ను షమీ టైగా ముగించాడు. ఆ తర్వాత మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీయడం.. టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 వెల్లింగ్టన్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ టీమ్ సౌథీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ రెండు మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన కేన్ విలియమ్సన్ బదులుగా డారిల్‌ మిచెల్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ స్థానంలో టామ్ బ్రూస్ ఆడుతున్నాడు.

మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మూడు మార్పులు చేసాడు. రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు విశ్రాంతిని ఇచ్చారు. వీరి స్థానంలో సంజు సాంసన్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ బుజ గాయం కారణంగా ఆడడం లేదు. అతడు కోలుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని సౌథీ తెలిపాడు.

Story first published: Friday, January 31, 2020, 12:35 [IST]
Other articles published on Jan 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+