
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలచుకుంటే ఠక్కున గుర్తొచ్చేది ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఆ జట్టులో వీరిద్దరూ లీగ్ ఆరంభం నుంచి ప్రధాన ఆటగాళ్లుగా కొనసాగుతూ అభిమానులను అలరిస్తున్నారు. క్రీజులో డివిలియర్స్, కోహ్లీ ఉంటే చూసే వాళ్లు అంచనాలను భారీగా పెంచేసుకుంటారు.
వాళ్లంటే అంత నమ్మకం. లీగ్ మొత్తంలో 10మ్యాచ్‌లు ఆడి 7ఓడిపోయినప్పటికీ ఆ జట్టుపై అభిమానులకు క్రేజ్ ఎంత మాత్రమూ తగ్గలేదు. కారణం విరాట్ కోహ్లీ. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న డివిలియర్స్ మాట్లాడుతూ.. కోహ్లీని కొనియాడాడు.
కోహ్లీ ఒక గొప్ప వ్యక్తి, గ్రేట్ కెప్టెన్.. అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీతో ఆడటాన్ని మీరెలా ఆస్వాదిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ఏబీడీ ఏం చెప్పాడంటే.. ఫెంటాస్టిక్. అతనొక గొప్ప వ్యక్తి. విరాట్‌తో కలిసి ఆడటాన్ని ఇష్టపడతా. అతనొక గొప్ప కెప్టెన్‌తో పాటు మంచి స్నేహితుడు కూడా. అందుకే అంతా గొప్పగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ ప్రేరణగా నిలిచే వ్యక్తిత్వం అతడిది. అని డివిలియర్స్ తెలిపాడు.
సీజన్‌లో మిగతా మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నామని చెప్పాడు. సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన ఆర్‌సీబీ సమష్టిగా రాణించకపోవడంతో కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొంది.. ఏడింటిలో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండోస్థానంలో కొనసాగుతోంది.