For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాలిలో ప్రేమ?: పరిణీతి చోప్రా ట్వీట్‌కి పాండ్యా క్లీన్ బౌల్డ్

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటిదే మరో బాలీవుడ్-క్రికెట్ లింకుతో మరో ప్రేమాయణం నడవనుందా?

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటిదే మరో బాలీవుడ్-క్రికెట్ లింకుతో మరో ప్రేమాయణం నడవనుందా? అనే అనుమానం అభిమానులకు కలిగింది.

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా మధ్య ట్విటర్‌ సంభాషణ ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఒక పార్కు పక్కన ఉంచిన సైకిల్‌ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన పరిణీతి.. 'అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ఇప్పుడు గాలిలో తేలియాడుతోంది' అని ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్‌కు హార్ధిక్ పాండ్యా బదులిచ్చాడు. 'పరిణీతి.. నేను ఊహించవచ్చా? నాకు తెలిసి ఇది బాలీవుడ్‌-క్రికెట్‌ లింక్‌ అయి ఉంటుంది. ఏదేమైనా మంచి ఫొటో' అని ట్వీట్‌ చేశాడు.

వెంటనే స్పందించిన చోప్రా 'హార్దిక్‌.. హహహ. కావొచ్చు. కాకపోవచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే ఆ ఫొటోలోనే క్లూ ఉంది' అని పేర్కొన్నది. దీంతో పరిణీతి చోప్రా, ఓ క్రికెటర్‌తో ప్రేమలో పడిందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో పరిణీతి అనూహ్యంగా స్పందించింది. ఇదంతా కూడా తన కొత్త సెల్ ఫోన్ ప్రమోషన్‌లో భాగంగా చేసుకొచ్చానని పరిణీతి చెప్పుకొచ్చింది. ఆ పాట్నర్ ఎవరో కాదు తన కొత్త సెల్‌ఫోన్‌ Redmi 5X గురించి అని దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చింది. Redmi 5Xతో తీసిన ఫోటో ఆకట్టుకునేలా ఉందని చెప్పింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+