
పోయిందనుకున్న ర్యాంక్ తిరిగొచ్చి:
వారం క్రితం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 149, 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి అగ్రస్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే.. లార్డ్స్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి పేలవంగా 23, 17 పరుగులే చేయడంతో అతని ఖాతాలో 15 పాయింట్లు కోత పడింది. దీంతో అతను 919 పాయింట్లతో మళ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. బాల్‌టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది నిషేధానికి గురై ఆరు నెలలకు పైగా ఆటకు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (929 పాయింట్లు) తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వచ్చినట్లే వచ్చి చేజారింది:
బౌలర్లలో అండర్సన్ 903 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. తొలి టెస్టుకి ముందు కోహ్లి ఖాతాలో 903 పాయింట్లు ఉండగా.. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ బాదడంతో.. 30 పాయింట్లు పెరిగి 934తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బాల్ టాంపరింగ్ కారణంగా.. స్టీవ్‌స్మిత్‌పై ఏడాది నిషేధం ఉండటంతో విరాట్ కోహ్లీ మళ్లీ టాప్ ర్యాంక్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

సచిన్ తర్వాత కోహ్లీనే
2011, జూన్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని దక్కించుకోగా.. ఆ తర్వాత ఆ ఘనత అందుకున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. ఓటమి అనంతరం రెండో టెస్టు ఫలితంపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘రెండో టెస్టుకు తుది జట్టు కూర్పు విషయంలో కొంచెం తప్పు చేశామని అనిపిస్తోంది. ఈ పొరబాటును తర్వాతి మ్యాచ్‌లో సరిదిద్దుకోవడానికి 0-2తో సిరీస్‌లో వెనుకబడ్డ స్థితిలో సానుకూలంగా ఆడి పుంజుకునే ప్రయత్నం చేయాల్సిందే'

తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు సాగుతాం.
ఫలితాన్ని 1-2గా మారిస్తే సిరీస్ కూడా రసవత్తరంగా మారుతుంది. మా బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలేమీ కనిపించడం లేదు. ఐతే మెదడులో స్పష్టత ఉంటే.. ఆటలోనూ ఉంటుంది. పిచ్‌పై బంతి ఎలా స్పందించినా ఎదుర్కోవచ్చు. ఏదో అయిపోతుందని మనసులో భయాలుంటే.. అనేక ఆలోచనలు చేస్తే గందరగోళం తప్పదు. సాధ్యమైనంత ప్రశాంతంగా ఆడటం ముఖ్యం. ఇక్కడి పరిస్థితుల్లో చాలా కష్టం అనే భావనతో రాకూడదు. సరైన సన్నద్ధతతో వస్తే అవి నిజంగా అంత కఠినంగా కనిపించవు. మా తప్పుల్ని సరిదిద్దుకుని ముందుకు సాగుతాం.


Click it and Unblock the Notifications











