బీసీసీఐ అధ్యక్షుడితో ఆరోగ్యకరమైన చర్చ కోసం ఎదురు చూస్తున్నా: విరాట్ కోహ్లీ

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో ఆరోగ్యకరమైన చర్చ కోసం తాను ఎదురు చూస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. గంగూలీతో సమావేశం జరిగినప్పుడు తామిద్దరం భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చిస్తామని విరాట్ కోహ్లీ తెలిపాడు.
బుధవారం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ "కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అధ్యక్ష హోదాలో గురువారం కోహ్లీతో సమావేశమవుతా. అతడికి ఎలాంటి సహకారం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం" అని అన్నాడు.

గంగూలీ వ్యాఖ్యలపై
గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన విరాట్ కోహ్లీ గంగూలీ వ్యాఖ్యలపై మాట్లాడుతూ "గంగూలీని కలవబోతున్నా. ఒక మంచి చర్చ కోసం ఎదురుచూస్తున్నా. గతంలో ఆయన ఎంతో క్రికెట్ ఆడారు. ఇప్పుడు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసు. భారత క్రికెట్, జట్టు అవసరాలేంటో తెలుసు" అని అన్నాడు.

అత్యున్నత సంభాషణ అవసరం
"ఇక్కడ చక్కని, వృత్తిపరమైన, అత్యున్నత సంభాషణ అవసరం. నేను ప్రస్తుతం ఆడుతున్నాను. ఆయన ఇంతకు ముందే ఆడారు కాబట్టి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. గతంలోనూ దాదాతో చాలాసార్లు సంభాషించా. ఇప్పుడూ ఇలాగే జరుగుతుందని భావిస్తున్నా" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ అద్భుతంగా నడిపిస్తున్నప్పటికీ!
టీమిండియాను విరాట్ కోహ్లీ అద్భుతంగా నడిపిస్తున్నాడని అయితే ఐసీసీ ట్రోఫీలు నెగ్గాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు కాకముందు గంగూలీ అన్న సంగతి తెలిసిందే. కాగా, బుధవారం 47 ఏళ్ల గంగూలీ తనకు కోహ్లీ మరియు జట్టు అవసరాలపై సరైన అవగాహన ఉందని తన పదవీకాలంలో వాటిని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications