కోహ్లీ - అనుష్క ఒక్కటయ్యే ఛాన్స్: అతనే మధ్యవర్తి!
ముంబై: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య విభేదాలు వచ్చాయని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారి మధ్య ప్యాచప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజాగా వార్తలొస్తున్నాయి.
వీరిద్దరని కలిపేందుకు ఓ వ్యక్తి రంగంలోకి దిగాడట. అనుష్క శర్మ సోదరుడు వీరి మధ్య నెలకొన్న విభేదాలను తొలగించే నిమిత్తం ముందుకు వచ్చాడని తెలుస్తోంది. అతనితో విరాట్ కోహ్లీ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో త్వరలోనే ఈ జంట తిరిగి కలుస్తుందన్న ఆశాభావం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కాగా, సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్' చిత్రంలో అవకాశం వచ్చిన సమయంలోనే కోహ్లీ పెళ్లి ప్రస్తావన తేగా అందుకు అనుష్క నిరాకరించంతో వీరి మధ్య బంధం తెగిపోయిందన్న వార్తలు వచ్చాయి.
'అనుష్క శర్మతో ఉన్న విభేదాలను తొలగించుకోవాలని, ఒక్కటి కావాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు, అనుష్క శర్మ సోదరుడితో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ - అనుష్కల మధ్య విభేదాలు తొలగిపోవచ్చు' అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications