తొలి టీ20: మ్యాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్సర్లు, పాండ్యా డెడ్‌బాల్ (వీడియో)


హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ సిక్సులతో చెలరేగుతున్నాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ తొలుత నెమ్మదిగానే ఆడినప్పటికీ, ఆ తర్వాత దూకుడు పెంచాడు.
కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్‌లో ఆస్ట్రేలియా 23 పరుగులు రాబట్టింది. ఈ మూడు సిక్సుల్లో ఒక సిక్సు 108 మీటర్ల దూరం వెళ్లి స్టేడియంలోని అప్పర్ స్టాండ్స్‌లో ఓ అభిమాని చేతిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
పాండ్యా ఓవర్‌లోనే మరో బంతిని మ్యాక్స్‌వెల్ స్పైడర్ కెమెరాకు తగిలేలా బాదాడు. దీంతో అంఫైర్ ఈ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాడు. మరో ఎండ్‌లో ఉన్న మార్కస్ స్టొయినిస్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే స్టొయినిస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు మ్యాక్స్‌వెల్ అజేయంగా హాఫ్ సెంచీరికిపైగా భాగస్వామ్యం నమోదు చేశాడు.
{cricket_304-2018_43620}
ఆ తర్వాత ఈ మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారాడు. బుమ్రా వేసిన 16.1వ బంతిని స్టొయినిస్ థర్డ్‌మ్యాన్ దిశగా గాల్లోకి పంపించాడు. చేతుల్లోకి వచ్చిన బంతిని ఫీల్డర్ ఖలీల్ జారవిడిచాడు. వెంటనే చినుకులు మొదలయ్యాయి. దీంతో మ్యాచ్‌కు కాసేపు విరామం ప్రకటించారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 153/3తో ఉంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
క్రీజులో మ్యాక్స్‌వెల్ 46, స్టోయినిస్ 31 పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు ముందుగా టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు.
సొంతగడ్డపై భారత్‌కి ఎలా పోటీనిస్తుందో
ఆసీస్ గడ్డపై మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు సొంతగడ్డపై భారత్‌కి ఎలా పోటీనిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సూపర్ ఫామ్‌లో రోహిత్ శర్మ
ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అద్భుతమైన పామ్‌లో ఉండగా, విండిస్‌తో మూడు టీ20ల సిరిస్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ చాలా రోజుల తర్వాత టీ20ల్లో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు ఏకంగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం
మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇందులో ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఆరు టీ20లు ఆడగా.. అందులోనూ నాలుగింట భారత్ గెలుపొందింది. టీ20 జరుగుతున్న బ్రిస్బేన్ పిచ్ ఎక్కువగా పేసర్లకి అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు:
భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
ఆస్ట్రేలియా తుది జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), క్రిస్ లిన్,డీఆర్క్ షార్ట్, బెన్ మెక్‌డెర్మాట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, బెరెన్‌డార్ఫ్, అలెక్స్ కేరీ, స్టాన్‌లేక్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications