Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: 'చూడు ఈ కుక్కను..': హారిస్ రౌఫ్‌కు సూర్య అదిరిపోయే కౌంటర్!

Viral Video: ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా సంతోషంగా కనిపించాడు. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే సూర్య.. పాకిస్తాన్ ఓటమి తర్వాత ఓ వీడియోను పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ తన పెంపుడు కుక్కతో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. అయితే ఈ వీడియో వచ్చిన టైమ్, సూర్య మాటలు పాక్ బౌలర్ హారిస్ రౌఫ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

కుక్కతో సూర్య ఫన్

సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై సూపర్ విక్టరీ సాధించిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక కుక్క కనిపిస్తుంది. దానిని "ఫన్" అని సూర్య పేర్కొన్నాడు. వీడియో మొదట్లో "చూడు ఈ కుక్కను" అంటూ సూర్య కుక్కతో సరదాగా సంభాషించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సూర్యకుమార్ యాదవ్ సరదా స్వభావాన్ని చూపిస్తున్నప్పటికీ.. హరీస్ రౌఫ్ దురుసు ప్రవర్తనకు సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పరోక్ష సమాధానం అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Look at this dog Suryakumar Yadav s Epic Counter to Haris Rauf in Viral Video

పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన
క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ రైవలరీని అత్యంత గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఎలాంటి రైవలరీ లేదని సూర్య స్పష్టం చేశాడు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు.పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. 'మీరు ఇకపై రైవలరీ గురించి అడగడం ఆపాలి. ఒకవేళ రెండు జట్లు 15-20 మ్యాచ్‌లు ఆడి, స్కోర్ లైన్ 7-7 లేదా 8-7 అయితే దాన్ని మీరు రైవలరీ అంటారు. కానీ స్కోర్ లైన్ 10-1 లేదా 13-0 అయితే, నాకు కరెక్ట్ స్టాట్స్ తెలియదు, కానీ ఇది ఇకపై రైవలరీ కాదు.' అని సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ గాలి తీసినంత పని చేశాడు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) అర్థ శతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అయితే భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) విధ్వంసకర బ్యాటింగ్‌తో 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Tuesday, September 23, 2025, 13:47 [IST]
Other articles published on Sep 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+