'రాహుల్‌ని రిజర్వ్ బెంచ్‌కి పరిమితం చేయకండి'

హైదరాబాద్: టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా రాణిస్తోన్న కేఎల్ రాహుల్‌ని వన్డేల్లో కూడా ఆడిస్తే మంచిదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కి సెలక్టర్లు చోటిచ్చినప్పటికీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు.
ఇప్పటికే ముగిసిన మూడు వన్డేల్లో కేఎల్ రాహుల్‌ని జట్టు మేనేజ్‌మెంట్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ చేరికతో జట్టు మిడిలార్డర్ బలహీనతని కొంతమేర అధిగమించవచ్చని గంగూలీ అభిప్రాయపడ్డాడు. తాజాగా గంగూలీ ఓ జాతీయ పత్రికకు కేఎల్ రాహుల్‌పై ఓ కాలమ్ రాశాడు.

మిడిలార్డర్ బలహీనత
ఇందులో "భారత్ జట్టు మిడిలార్డర్ బలహీనత గురించి అతిగా ఆలోచిస్తోంది. కానీ.. ఆ సమస్య తీరాలంటే రాహుల్ రిజర్వ్ బెంచ్‌పై ఉండకుండా తుది జట్టులోకి రావాలి. అతని చేరికతో జట్టులో కూడా సమతూకం లభిస్తుంది. సెలక్టర్లు అతని విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు" అని గంగూలీ వెల్లడించాడు.

రాహుల్‌ని మూడో ఓపెనర్‌గానే
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కేఎల్ రాహుల్‌ని మూడో ఓపెనర్‌గానే తాము చూస్తున్నామని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లలో ఎవరో ఒకరిని తప్పిస్తే తప్ప రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

బ్రబౌర్న్ స్టేడియంలో ప్రారంభమైన 4వ వన్డే
ముంబై వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య 4వ వన్డే ప్రారంభమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో నాలుగో వన్డే మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.

రిషబ్ పంత్, స్పిన్నర్ చాహల్‌పై వేటు
రిషబ్ పంత్, స్పిన్నర్ చాహల్‌పై వేటు వేసి రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్‌లకు జట్ట మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. సిరీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిందే. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేల ముగియగా ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications