తీర్పు వ్యతిరేకమైతే: ప్లాన్ బితో సిద్ధంగా ఉండండి
హైదరాబాద్: జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బోర్డులో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించేందుకు శుక్రవారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) నిర్వహించింది. అయితే లోధా ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.
సుప్రీం కోర్టు డిసెంబర్ 5న తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉండటంతో దాని కోసం ఎదురు చూడాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. సుప్రీం తీర్పు అనుకూలంగా రాకపోతే 'ప్లాన్-బి'తో సిద్ధంగా ఉండాలని బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు సూచించినట్టు సమాచారం.

బీసీసీఐ సర్వసభ్య సమావేశం
బీసీసీఐ ఆఫీస్ బేరర్లను పదవుల నుంచి తొలిగించి బోర్డు వ్యవహారాలను చక్కబెట్టేందుకు హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు ఆదేశించాలని ఇటీవలే లోధా కమటీ సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది.

ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ధిక్కారమే
‘మేం డిసెంబర్ 5 వరకు వేచి చూడాలని బీసీసీఐ ఆఫీస్ బేరర్లు అన్నారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ధిక్కారమే అవుతుంది. కోర్టు వ్యతిరేకంగా తీర్పిస్తే ప్లాన్ బితో సిద్ధంగా ఉండాలని, రాజ్యాంగంలో మార్పులు చేసుకోని దానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు' అని ఓ రాష్ట్ర సంఘం యూనిట్ అధికారి ఒకరు తెలిపారు.

త్రిపుర, విదర్భ క్రికెట్ సంఘాలు గైర్హాజరు
ఈ సమావేశానికి లోధా కమిటీ సంస్కరణలకు పూర్తి మద్దతు ప్రకటించిన త్రిపుర, విదర్భ క్రికెట్ సంఘాల ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ రెండు సంఘాలు లోధా కమిటీ సిఫార్సులు ఉన్నవి ఉన్నట్లు అమలు చేసేందుకు గతంలోనే అంగీకరించాయి. పొగమంచు వల్లే ఈ రెండు సంఘాల ప్రతినిధులు సమావేశానికి రాలేకపోయాయి.

లోధా కమిటీ సూచనలకు బోర్డు ససేమేరా
దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశామని బీసీసీఐ కార్యదర్శి అజయ్‌షిర్కే వెల్లడించారు. లోధా ప్యానెల్ సూచించిన 70 ఏళ్ల గరిష్ట వయస్సు, మూడేళ్ల కూలింగ్ పీరియడ్, ఒక రాష్ట్రానికి ఒక ఓటు లాంటి ప్రతిపాదనలను బోర్డు ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications