న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండ‌ర్‌డాగ్ ముద్ర మంచిదే: రోహిత్‌ను క‌ట్టి ప‌డేస్తాం: కివీస్ ఫాస్ట్ బౌల‌ర్‌!

Lockie Ferguson happy with underdogs tag ahead of CWC semi-final


మాంచెస్ట‌ర్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో మెరుగైన ర‌న్‌రేట్ ప్రాతిప‌దిక‌న సెమీఫైన‌ల్‌కు చేరిన త‌మ‌ జ‌ట్టుపై అండ‌ర్‌డాగ్ అనే ముద్ర ప‌డ‌టం మంచిదేన‌ని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌల‌ర్ లోకీ ఫెర్గూస‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. దీనివ‌ల్ల త‌మ‌పై ఎలాంటి ఒత్తిడి ఉండ‌బోద‌ని చెప్పారు. ఫ‌లితంగా- స్వేచ్ఛ‌గా ఆడ‌గ‌లుగుతామ‌ని, ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడిలోకి నెట్ట‌గ‌ల‌మ‌ని ఆయ‌న అన్నారు. 2015 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో కూడా తాము అండ‌ర్‌డాగ్ ముద్ర‌తోనే బ‌రిలోకి దిగామ‌ని గుర్తుచేశారు. అండ‌ర్‌డాగ్‌గా ఉంటూ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో కూడా అలాంటి వాతావ‌ర‌ణ‌మే నెల‌కొని ఉందని ఫెర్గూస‌న్ స్ప‌ష్టం చేశారు.

ఆ ఇద్ద‌ర్నీ ప‌క్క‌న పెట్ట‌డ‌మే బెట‌ర్‌: టీమిండియాకు కెవిన్ స‌ల‌హా! ఫైన‌ల్ ఆడ‌బోయేది వాళ్లే!ఆ ఇద్ద‌ర్నీ ప‌క్క‌న పెట్ట‌డ‌మే బెట‌ర్‌: టీమిండియాకు కెవిన్ స‌ల‌హా! ఫైన‌ల్ ఆడ‌బోయేది వాళ్లే!

రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌త్యేక దృష్టి
టీమిండియా ఓపెన‌ర్ రోహిత్‌శ‌ర్మ‌ను వీలైనంత త్వ‌ర‌గా అవుట్ చేయ‌డానికి తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని ఫెర్డూస‌న్ చెప్పారు. దీనికోసం అత‌ని బ్యాటింగ్ శైలిని అధ్య‌యనం చేస్తున్నామ‌ని అన్నారు. బ‌ల‌హీన‌త‌ల‌ను కనిపెడుతున్నామ‌ని పేర్కొన్నారు. రోహిత్ శ‌ర్మ భారీ ఇన్నింగ్ ఆడిన ప్ర‌తీసారీ లైఫ్ దొరికిన విష‌యాన్ని విస్మ‌రించ‌కూడాద‌ని అన్నారు. అలాంటి అవ‌కాశాన్ని తాము రోహిత్‌కు ఇవ్వ‌బోమ‌ని చెప్పారు. రోహిత్ శ‌ర్మ‌నుతో పాటు టాప్ ఆర్డ‌ర్‌ను వీలైనంత త్వ‌ర‌గా పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డం వ‌ల్ల టీమిండియాపై ఒత్తిడిని తీసుకుని రావాల‌నేది త‌మ ప్లాన్ అని చెప్పుకొచ్చారు.

Story first published: Monday, July 8, 2019, 13:36 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X