లాక్‌డౌన్ ప్రజల్ని పిచ్చొళ్లని చేసింది.. ధోనీ రిటైర్మెంట్ రూమర్స్‌పై సాక్షి ఫైర్!!

జార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ మరోసారి చర్చల్లో నిలిచింది. గతంలో కాకుండా ఈసారి పతాక స్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 అనంతరం ధోనీ మైదానంలోకి మళ్లీ దిగలేదు. అయితే వన్డే ప్రపంచకప్‌తోనే మహీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ ఆ టోర్నీ తర్వాత మౌనంగా ఉండిపోయాడు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్ డైనమెట్ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది.

ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా:
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మాజీలందరూ తమ అభిప్రాయాలను బహిరంగానే చెప్పారు. కొందరు మహీ ఇంకా ఆడాలని అంటే.. మరికొందరు రిటైర్మెంట్ ప్రకటించాలన్నారు. ఇలా ఎన్ని వార్తలు వచ్చినా ఈ 10 నెలల్లో అతడు ఒక్కసారి కూడా పెదవి విప్పలేదు. మరోవైపు ఐపీఎల్ 2020లో ధోనీ ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి (టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం) వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ.. కరోనా వైరస్ మహమ్మారి లాక్‌డౌన్ కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మహీ భవిష్యత్ డైలమాలో పడింది.

ట్రెండ్ అయిన dhoniretire హ్యాష్ ట్యాగ్:
బుధవారం ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తీసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక dhoniretire అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్ అయింది. దీంతో ప్రతి ఒక్కరు అయోమయానికి గురయ్యారు. ఇక మహీ అభిమానులు అయితే ఏడ్చేసినంత పని చేసారు. అయితే ఈ వార్తలను మహీ సతీమణి సాక్షి సింగ్ ధోనీతో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. ఇక్కడ సాక్షి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది.

లాక్‌డౌన్ ప్రజలను పిచ్చొళ్లును చేసింది:
సహనం కోల్పోయిన సాక్షి అవి కేవలం రూమర్ మాత్రమే అని ఖండిస్తూ.. ఈ లాక్‌డౌన్ ప్రజల్ని పిచ్చొళ్లని చేసిందని ఘాటుగా స్పందించారు. 'అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్ ప్రజలను పిచ్చొళ్లును చేసిందని నేను అర్థం చేసుకున్నాను' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఇన్ని రోజులు కూల్‌గానే ఉన్న సాక్షి.. ఈసారి మాత్రం ఫైర్ అయ్యారు. తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో సహనం కోల్పోయి కోపంలో సాక్షి అలా ట్వీట్ చేశారని కొందరు అంటున్నారు.

ప్రశ్నార్ధకంలో మహీ భవిష్యత్:
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 10 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్‌పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కరోనా కారణంగా మహీ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications