సిడ్నీ: అనుకున్నదే అయింది. టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్టేలియా 95 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
మార్చి 29న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆస్టేలియా తలపడనుంది. ఆస్టేలియా నిర్దేశించిన 329 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో 46.5 ఓవర్లో భారత్ ఆలౌటైంది. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఆస్టేలియా సెంచరీ మ్యాన్ స్టీవెన్ స్మిత్‌కు దక్కింది.

టీమిండియా 7 మ్యాచ్‌ల వరుస విజయాలతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగినా ఆస్టేలియా దూకుడు ముందు నిలవలేకపోయింది. ఈ టోర్నమెంట్లో ఆస్టేలియా కూడా ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పరాజయం పాలైంది. ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఈ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చాయి. ఆతిథ్యదేశాల్లో ఒకటైన న్యూజిలాండ్ ఇప్పటికే పైనల్‌కు చేరింది.

కోహ్లీ, రైనాల ఆటతీరుపై అభిమానుల ఆగ్రహం:
* ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా సిడ్నీ మైదానంలో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పేలవమైన ఆటతీరుతో తక్కు స్కోర్లకే ఔటైన సురేష్ రైనా, విరాట్ కోహ్లీలపై టీమిండియా అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.
9వ వికెట్ కోల్పోయిన భారత్:
* మోహిత్ శర్మ ఔట్ అవడంతో భారత్ 9వ వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ డౌకట్‌గా వెనుదిరిగాడు.
8వ వికెట్ కోల్పోయిన భారత్:
* రవిచంద్రన్ అశ్విన్ ఔట్ అవడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌ను ఫల్కనర్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 46 ఓవర్లకు గాను టీమిండియా 9 వికెట్లను కోల్పోయి 239 పరుగులు చేసింది.
ఏడో వికెట్ కోల్పోయిన భారత్:
* జట్టు స్కోరు 231 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్‌ను ధోనీ రూపంలో కోల్పోయింది. 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధోని రనౌట్ ఔటయ్యాడు. మాక్సె వెల్ వేసిన బంతి నేరుగా వికెట్లకు తగలడంతో ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా పరాజయానికి ఇక మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ధోని అర్ధ సెంచరీ:
* కష్టాల్లో ఉన్న భారత్‌ను గట్టెక్కించేందుకు కెప్టెన్ ధోని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 55 బంతుల్లో 53 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ గెలుపుకు 45 బంతుల్లో 108 పరుగులు చేయాల్సి ఉంది.
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా:
* జట్టు స్కోరు 208 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ధోని కొట్టిన షాట్‌కు పరుగు తీసే ప్రయత్నంలో స్మిత్ వేసిన బంతి డైరెక్టుగా వికెట్లకు తగలడంతో రనౌట్ అయ్యాడు.

ఐదో వికెట్ కోల్పోయి టీమిండియా:
* జట్టు స్కోరు 178 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన అజ్యెంకె రహానే. 36.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 179 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయంపై అభిమానులకు ఆశలు సన్నగిల్లాయి.
150 పరుగుల మైలురాయిని దాటిన భారత్:
* ఆసీస్ బౌలర్ హెజిల్ వుడ్ వేసిన 31వ ఓవర్లో ధోని రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తం ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో టీమిండియా 150 పరుగులు మైలురాయిని దాటింది.
డ్రింక్స్ బ్రేక్:
* 33 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్‌పై భారత్ విజయం సాధించాలంటే 102 బంతుల్లో 172 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజ్యెంక రహానే 40, ధోని 28 పరుగులతో ఉన్నారు.
మైదానం నుంచి అభిమానులు బయటకు:
* టీమిండియా ఓటమి పాలవడం ఖాయమని తెలిసిన కొందరు క్రికెట్ అభిమానులు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను బయటకు వస్తున్న దృశ్యం.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఆస్లేలియా అభిమానుల సందడి:
29 ఓవర్లకు టీమిండియా స్కోరు 133/4
* టీమిండియా 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 329 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో ఆకట్టుకున్నా ఆ తర్వాత వరుస వికెట్ల పతనంతో కష్టాల్లో ఉంది.
సిడ్నీ ఆనవాయితీ కొనసాగుతుందా?
* సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు ఓ ఆనవాయితీ ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆతిథ్య దేశం ఆస్టేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆస్టేలియా, భారత్‌లు ఇంతక ముందు 13 మ్యాచ్ లు ఆడగా, భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే సిడ్నీలో 2011 నుంచి 9 వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో ఛేజింగ్ జట్లే గెలిచాయి.
సురేష్ రైనా ఔట్:
* జట్టు స్కోరు 108 పరుగుల వద్ద సురేష్ రైనా ఔట్ అవడంతో భారత్ నాల్గవ వికెట్‌ను కోల్పోయింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సురేష్ రైనా, ఫల్కనర్ బౌలింగ్‌లో హాడ్డిన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు కష్టాల్లో పడింది. 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 108 పరుగులు చేసింది.

100 పరుగుల మైలురాయిని దాటిన భారత్:
* టీమిండియా కష్టాల్లో పడింది. 22 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సురేష్ రైనా 2, అజ్యంకే రహానే 11 పరుగులతో ఉన్నారు.
రోహిత్ శర్మ ఔట్:
* రోహిత్ శర్మ రూపంలో భారత్ మూడో వికెట్‌ను కోల్పోయింది. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాన్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అవడంతో రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. 48 బంతుల్లో రోహిత్ శర్మ 34 పరుగులు చేశాడు. 18 ఓవర్ల కు గాను భారత్ 3 వికెట్లను నష్టపోయి 91 పరుగులు చేసింది. క్రీజులో అజ్యెంక రహానే 4, సురేష్ రైనా 0 పరుగులతో ఉన్నారు.

78 పరుగుల వద్ద కోహ్లీ ఔట్:
* జట్టు స్కోరు 78 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
14 ఓవర్లకు భారత్ స్కోరు 77/1:
* 14 ఓవర్లకు గాను భారత్ ఒక వికెట్ నష్టానికి 77 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ 1 పరుగులతో ఉన్నారు.
ధావన్ అర్ద సెంచరీ మిస్, ఔట్:
* జట్టు స్కోరు 76 పరుగుల వద్ద శిఖర్ ధావన్ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 41 బంతుల్లో 45 పరుగులు (6 ఫోర్లు, ఒక సిక్స్) చేసిన శిఖర్ ధావన్ అర్ద సెంచరీని మిస్ అయ్యాడు.

12 ఓవర్లకు టీమిండియా స్కోరు 73:
* భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. 10 ఓవర్లకు టీమిండియా స్కోరు 73 పరుగులు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 21, శిఖర్ ధావన్ 45 పరుగులతో ఉన్నారు. 40 బంతుల్లో శిఖర్ ధావన్ 45 పరుగులు సాధించాడు.
వన్డేల్లో 15 సార్లు 300కు పైగా పరుగులను చేజ్ చేసిన టీమిండియా:
* అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు భారత్ 15 సార్లు 300కు పైగా పరుగులను చేజింగ్ చేసిన అనుభవం టీమిండియాకు ఉంది.
ఓవర్‌కు నాలుగు రన్ రేట్‌తో టీమిండియా ఇన్నింగ్స్:
* టీమిండియా ఓపెనర్లకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఆచితూచి ఆడుతున్నారు. ఓవర్‌కు నాలుగు రన్ రేట్‌తో టీమిండియా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. ఇద్దరు ఓపెనర్లు కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫాల్కనర్ బౌలింగ్ వరుసగా 2 వరుస ఫోర్లు, ఒక సిక్స్ రోహిత్ శర్మ కొట్టాడు.
ధావన్, రోహిత్ శర్మలకు లైఫ్‌లు:
* ధావన్ ఇచ్చిన క్యాచ్‌ను హాడిన్ వదిలేయగా, రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను వాట్సన్ వదిలేశాడు.
నిలకడగా ఆడుతున్న భారత బ్యాట్స్ మెన్లు:
* ధావన్, రోహిత్‌లు నిలకడగా ఆడుతున్నారు. ప్రధానంగా వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడు ఓవర్లకు భారత్ 32 పరుగులు చేసింది. రోహిత్ (17), ధావన్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లకు భారత్ స్కోరు 20/0:
* ఐదు ఓవర్లకు భారత్ స్కోర్ 20/0. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు నిలకడగా ఆడుతున్నారు. మూడు ఓవర్లకు 9 పరుగులు చేశారు. రోహిత్ 12 బంతుల్లో 7, ధావన్ 6 బంతుల్లో 1 పరుగు చేశాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది.
టీమిండియా విజయలక్ష్యం 329 పరుగులు:
* ఆస్టేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ జాన్సన్ 9 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. అందులో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు ఉండటం విశేషం. చివరి మూడు ఓవర్లలో ఆస్టేలియా 41 పరుగులు సాధించింది. చివరి 10 ఓవర్లకు గాను ఆస్టేలియా 89 పరుగులు సాధించింది. ఇక భారత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా, మెహిందర్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు.

49వ ఓవర్‌లో నిర్లక్ష్యంగా బౌలింగ్ వేసిన షమీ
* 49వ ఓవర్‌లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ నిర్లక్ష్యంగా బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్లో జాన్సన్ మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచారు.
ఏడో వికెట్ కోల్పోయిన ఆస్టేలియా:
* ఆస్టేలియా జట్టు 298 పరుగుల వద్ద షేన్ వాట్సన్ రూపంలో ఏడో వికెట్‌ను ఆసీస్ కోల్పోయింది. రోహిత్ శర్మ బౌలింగ్‌లో వాట్సన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అవడంతో వెనుదిరిగాడు. దీంతో 48 ఓవర్లకు ఆస్టేలియా 7 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

ఆరో వికెట్ కోల్పోయిన ఆస్టేలియా:
* జట్టు స్కోరు 284 పరుగుల వద్ద జేమ్స్ ఫల్కనర్ రూపంలో ఆస్టేలియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జేమ్స్ ఫల్కనర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
* 43 ఓవర్లకు గాను ఆస్టేలియా 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో షేన్ వాట్సన్ 13, ఫల్కనర్ 2 పరుగులతో ఉన్నారు.
ఐదవ వికెట్ కోల్పోయిన ఆసీస్:
* 248 పరుగుల వద్ద్ ఆస్టేలియా ఐదవ వికెట్ కోల్పోయింది. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్‌ను శర్మ పెవిలియన్‌కు చేరాడు. బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేసేందుకు భారత్ బౌలర్ల యత్నిస్తున్నారు. బ్యాటింగ్ పవర్ ప్లేలో భారత బౌలర్లు తమ సత్తాని చాటుతున్నారు. టీమిండియా బౌలర్ ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
* 40 ఓవర్లకు గాను ఆస్టేలియా 4 వికెట్ల నష్టానికి 239 పరుగులు సాధించింది. ఇప్పటి వరకు పరుగుల వరద పారించిన స్మిత్, ఫించ్ ఔట్ అవడంతో ఇద్దరు కొత్త బ్యాట్స్ మెన్లు క్రీజులో ఉన్నారు.

నాల్గవ వికెట్ కోల్పోయిన ఆస్టేలియా:
* జట్టు స్కోరు 238 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ రూపంలో నాల్గవ వికెట్ కోల్పోయింది. ఉమేష యాదవ్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో షేన్ వాట్సన్ 0, మైఖెల్ క్లార్ 1 పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఆస్టేలియా:
* 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాక్స్ వెల్ రూపంలో ఆస్టేలియా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 37.3 ఓవర్లకు 232 పరుగుల వద్ద మాక్స్ వెల్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. అందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అశ్మిన్ బౌలింగ్‌లో రహానే క్యాచ్ అందుకున్నాడు.
200 పరుగులు మైలురాయికి చేరిన ఆస్టేలియా:
* దూకుడుగా ఆడుతున్న ఆస్టేలియా 200 పరుగుల మైలురాయిని చేరింది. 35 ఓవర్లకు గాను 2 వికెట్లను నష్టపోయిన ఆస్టేలియా 206 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్:
* ఆస్టేలియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 34.1 ఓవర్‌లో 197 పరుగుల వద్ద స్మిత్ ఔట్ అయ్యాడు. 93 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 105 పరుగులు సాధించిన స్మిత్. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.
గుడ్ లక్ టీమిండియా: వైయస్ జగన్:
* వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఈరోజు ఆసీస్‌తో తలపడుతున్న టీమిండియాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన ట్వట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
స్టీవెన్ స్మిత్ సెంచరీ:
* ఆస్టేలియా బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ 89 బంతుల్లో సెంచరీ సాధించాడు. అందులో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉండటం విశేషం. 33 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 181 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్ 62, స్మిత్ 100 పరుగులతో ఉన్నారు.

భారత్ గెలిచి తీరితుందున్న అభిమానులు:
* ఒకవైపు ఆస్టేలియా పరుగుల వేట పారిస్తోంది. మరోవైపు టీమిండియా అభిమానులు మాత్రం భారతే గెలిచి తీరితుందుని అంటున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు.
ఆసీస్ దూకుడు:
* 30.4 ఓవర్లకు గాను ఆసీస్ 160 పరుగులు చేసింది. భారీ స్కోరు దిశగా ఆస్టేలియా సాగుతోంది. ఇప్పుడు వికెట్ తీయకపోతే పవర్ ప్లేలో వికెట్లు పడగొట్టడం కష్టం. అర్ద సెంచరీలతో ఆరోన్ ఫించ్, స్మిత్ దూసుకుపోతున్నారు. ఈ జోడీని కట్టడి చేస్తేనే టీమిండియా విజయానికి అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్ 56, స్మిత్ 85 పరుగులతో ఉన్నారు.
ఎల్‌బీడబ్ల్యు ఔట్ నుంచి తప్పించుకున్న ఆరోన్ ఫించ్:
* రవీంద్ర జడేజా వేసిన 23వ ఓవర్ నాల్గవ బంతికి ఫించ్ ముందుకు ఆడటానికి ప్రయత్నించగా బంతి ప్యాడ్‌లకు తగిలింది. బౌలర్లు అప్పీల్ చేశారు. అప్పీల్‌ను అంఫైర్ తిరస్కరించగా రివ్యూకు వెళ్లారు. రివ్యూలో బంతి వికెట్లకి తగలిందని కనిపించిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంఫ్ లైన్‌లో పడటంతో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అంఫైర్ కే వదిలేశాడు. దీంతో ఆరోన్ ఫించ్‌ను నాటౌట్‌గా అంపైర్ ప్రకటించాడు.
ఫ్యాన్ ట్వీట్:
* స్మిత్‌కు వన్డేల్లో ఇది 10వ అర్ధ సెంచరీ. స్మిత్ అర్ధ సెంచరీ సాధించిన గత 9 మ్యాచ్‌ల్లో ఆస్టేలియా విజయం సాధించింది.
స్మిత్ అర్ధ సెంచరీ:
* 53 బంతుల్లో స్టీవెన్ స్మిత్ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ టోర్నమెంట్లో స్టీవెన్ స్మిత్‌కు ఇది నాల్గవ అర్ద సెంచరీ.
100 పరుగులు మైలురాయికి చేరుకున్న ఆస్టేలియా:
* 19 ఓవర్లకు గాను ఆస్టేలియా 100 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 53, ఆరోన్ ఫించ్ 34 పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా రాణిస్తూ ఆసీస్ స్కోరు బోర్డుని పరుగెత్తిస్తున్నారు.
14వ ఓవర్‌లో బౌలింగ్‌కు జడేజా:
* టీమిండియా కెప్టెన్ 14వ ఓవర్‌లో ఆల్ రౌండర్ జడేజాను రంగంలోకి దించాడు. ఈ వరల్డ్ కప్‌లో జడేజా తన బౌలింగ్ తో ఇంతరవరకూ పెద్దగా ప్రభావం చూపలేదు. జడేజా తన మొదటి ఓవర్‌లో ఆరు పరుగులు ఇచ్చాడు.
ఫీల్డింగ్ కోసం రాయుడిని రప్పించిన ధోనీ:
* టీమిండియాలో ఫీల్డింగ్ కు ఏమాత్రం లోటు లేకుండా సేనాధిపతి ధోనీ చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జట్టులో బలహీనంగా ఉన్న అశ్విన్ స్థానంలో అంబటి రాయుడిని, ధోనీ మైదానంలోకి రప్పించాడు. 11వ ఓవర్ నుంచి రాయుడు ఫీల్డింగ్ చేస్తున్నాడు.
ధోని సరికొత్త ప్రయోగం:
* 12వ ఓవర్‌లో కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లీ చేత బౌలింగ్ వేయించి కొత్త ప్రయోగం చేశారు. ఆసీస్ ప్లేయర్లు నిలదొక్కుకొని నిలకడగా రాణించడంతో ధోని ఈ ప్రయోగం చేశాడని తెలుస్తోంది.
నిలకడగా రాణిస్తోన్న స్మిత్, ఫించ్ జోడీ:
* సిడ్నీ పిచ్‌పై ఆస్టేలియా బ్యాట్స్ మెన్లు స్మిత్, ఆరోన్ ఫించ్ నిలదొక్కకుని నిలకడగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓవర్‌కు 6 రన్ రేట్ చొప్పున పరుగులు సాధిస్తున్నారు.
షార్ట్ పిచ్ బంతులతో ఒత్తిడికి గురి చేస్తోన్న టీమిండియా బౌలర్లు:
* ఆస్టేలియాతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు నిప్పులు చెలరేగుతున్నారు. షార్ట్ పిచ్ బంతులతో ఆసీస్ బ్యాట్స్ మెన్లను షమీ, ఉమేష్ యాదవ్‌లు ఒత్తిడి గురి చేస్తున్నారు.
50 పరుగులు చేసిన ఆస్టేలియా:
* 10 ఓవర్లకు గాను ఆస్టేలియా 56 పరుగుల మైలురాయిని దాటింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 30, ఆరోన్ ఫించ్ 11 పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా రాణిస్తూ ఆసీస్ స్కోరు బోర్డుని పరుగెత్తిస్తున్నారు.
* 5 ఓవర్లు పూర్తయ్యాయి. ఒక వికెట్ నష్టానికి ఆస్టేలియా 31 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్:
* ఆస్టేలియా తొలి వికెట్‌ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3.1 ఓవర్లకు గాను ఆసీస్ ఒక వికెట్ నష్టపోయి 15 పరుగులు చేసింది. స్మిత్ బ్యాటింగ్‌కు దిగాడు.
* రెండో ఓవర్‌లో సిక్స్. 2 ఓవర్లకు గాను ఆసీస్ 14 పరుగులు సాధించింది.
* భారత్ గనుక వికెట్లను పడగొట్టకుండా ఉంటే ఆసీస్ స్కోరు 350 నుంచి 400 మధ్య ఉంటుందని షేన్ వార్న్ అన్నారు.
* మ్యాచ్ ప్రారంభమైంది. తొలి బంతిని షమీ సంధించాడు.

* పిచ్ డ్రైగా ఉంది ఆస్టేలియాకు కలిసి వస్తుందని షేన్ వార్న్ స్పందన
* టీమిండియా బౌలర్లు కొత్త బంతిని తీసుకుంటున్న దృశ్యం
* ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవు.
భారతదేశం: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్.
ఆస్ట్రేలియా: మైఖేల్ క్లార్క్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, బ్రాడ్ హడిన్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, జేమ్స్ ఫాల్క్నెర్, మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, జోష్ హోజల్‌వుడ్.
* టాస్ గెలిచిన ఆస్టేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
* ఐసీసీ వరల్డ్ కప్ సెమీ పైనల్ మ్యాచ్‌పై వీవీఎస్ లక్ష్మణ్ స్పందన
* ఆస్టేలియా క్రికెటర్లకు సూచనలిస్తున్న మాజీ క్రికెటర్ షేన్ వార్న్