Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజ్ కోట్ టెస్టు: తొలి వికెట్ అశ్విన్‌కే, లంచ్ విరామానికి వెస్టిండిస్ 33/1

Live Score India vs West Indies, 1st Test, Day 3 Match Today: Play resumes after Lunch, Ashwin-Umesh continue

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్.. తన రెండవ ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమాయానికి ఒక వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రాత్‌వైట్‌ ఔటవ్వడంతో ప్రస్తుతం క్రీజులో కైరెన్‌ పోవెల్‌(22), షై హోప్‌(1) పరుగులతో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైన వెస్టిండిస్‌ ఫాలోఆన్‌ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండిస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ బ్రాత్‌వెయిట్(10) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటైయ్యాడు. వెస్టిండిస్ జట్టు ఇంకా 435 పరుగులు వెనకబడి ఉంది.

1
44264

ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే

ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే వెస్టిండిస్ జట్టు తన శక్తికి మించి పోరాడాల్సి ఉంది. అంతకముందు మూడో రోజైన శనివారం ఓవర్‌ నైట్ స్కోరు 94/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన వెస్టిండీస్‌ జట్టు 181పరుగులకే ఆలౌటైంది. శుక్రవారం భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 649/9తో డిక్లేర్ చేసిన నేపథ్యంలో.. 468 పరుగుల భారీ ఆధిక్యం భారత్‌కు లభించింది.

అనివార్యమైన ఫాలో ఆన్

దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలో ఆన్ ఆడటం అనివార్యమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 94/6తో మూడో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. మూడో రోజు 87 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. మూడో రోజు అశ్విన్‌ మూడు వికెట్లు తీసి విండీస్‌ పతనాన్ని శాసించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్

ఉమేశ్‌ యాదవ్‌ ఒక వికెట్‌ దక్కింది. మొత్తం భారత బౌలర్లలో అశ్విన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమీ రెండు, ఉమేశ్ యాదవ్, జడేజా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ (53: 79 బంతుల్లో 8 ఫోర్లు), కీమో పాల్ (47: 49 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 649/9కి డిక్లెర్‌‌ చేసిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, October 6, 2018, 13:01 [IST]
Other articles published on Oct 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+