For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుల్దీప్ రికార్డు, రోహిత్ శర్మ సెంచరీ: తొలి వన్డేలో భారత్ ఘనవిజయం

By Nageshwara Rao
India Vs England 1st ODI Toss Update
Rohit

హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరిస్‌లోనూ బోణీ కొట్టింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(40), రోహిత్‌ శర్మ(137 నాటౌట్‌) తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ఈ జోడీ కుదురుకుంటున్న తరుణంలో శిఖర్‌ ధావన్‌ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీతో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఇద్దరూ చక్కని సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు జతచేశారు. దీంతో 15వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది.

ఈ క్రమంలో రోహిత్‌ 54 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్‌)... తర్వాత కోహ్లి 55 బంతుల్లో (5 ఫోర్లు) హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. దీంతో 30 ఓవర్లకంటే ముందే 28.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ల బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టిన రోహిత్‌ 82 బంతుల్లో (12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు.

1
42371

వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 18వ సెంచరీ. రెండో వికెట్‌కు 167 పరుగులు జోడించాక, జట్టు స్కోరు 226 పరుగుల వద్ద విరాట్‌ కోహ్లి(75) స్టంపౌటయ్యాడు. అయినా రోహిత్‌ ఏకాగ్రత కోల్పోకుండా కేఎల్‌ రాహుల్‌(9)తో కలిసి మరో వికెట్‌ 40.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది. రెండో వన్డే లార్డ్స్‌ మైదానంలో జులై 14న జరగనుంది.


భారత్ విజయ లక్ష్యం 269

ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌(25/6) మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5ఓవర్లలో ఇంగ్లాండ్‌ 268 పరుగులు చేసి ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోస్ బట్లర్‌(53), బెన్‌ స్టోక్స్(50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఆరు, ఉమేశ్ యాదవ్ రెండు, చాహల్ ఒక వికెట్ తీశారు.



బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ... ఆ వెంటనే ఔట్

ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీని నమోదు చేసి ఆ వెంటనే పెవిలియన్‌కు చేరాడు. 103 బంతుల్లో 2 ఫోర్లతో బెన్ స్టోక్స్ 50 పరుగులు నమోదు చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ వేసిన 45వ ఓవర్ తొలి బంతికి సిద్ధార్త్ కౌల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 46 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్రీజులో అలీ(8), రషీద్(0) పరుగులతో ఉన్నారు.


నిలకడగా ఆడుతోన్న జోస్ బట్లర్
ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో జోస్‌ బట్లర్‌(50) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్‌ బెన్‌ స్టోక్స్‌(37) దూకుడుగా ఆడుతో బౌండరీలు బాదుతున్నాడు. అయితే ఆరంభంలో వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు ఈ జోడీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న ఈ జోడీ సెంచరీ భాగస్వామ్యం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో 36 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 187పరుగులు చేసింది.


నిలకడగా ఇంగ్లాండ్ బ్యాటింగ్
ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను.. బెన్‌ స్టోక్స్‌(21) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మరో బ్యాట్స్‌మెన్‌ బట్లర్‌(17)తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో 30 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టోక్స్(18), బట్లర్(15) పరుగులతో ఉన్నారు.


నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి వన్డేలో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వెనువెంటనే మూడు వికెట్లు తీసి కుల్దీప్‌ ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించగా.. మరో స్పిన్నర్‌ యజువేంద్ర చాహాల్‌ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతోన్న ఇయాన్ మోర్గాన్-స్టోక్స్‌ జోడీని విడగొట్టాడు. ఈ క్రమంలో చాహాల్‌ వేసిన 20ఓవర్‌ రెండో బంతిని షాట్‌ ఆడబోయిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(19) రైనాకు సులభ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో 22 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 4 వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టోక్స్(18, బట్లర్(15) పరుగులతో ఉన్నారు.


ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. అతని బౌలింగ్ శైలిని అర్థం చేసుకోలేక ఆతిథ్య బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకుంటున్నారు. కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని అతడు మరోసారి నిలబెట్టుకున్నాడు. తన తొలి ఓవర్ రెండో బంతికే ప్రమాదకర జాసన్ రాయ్‌ను పెవిలియన్ పంపి వికెట్ల ఖాతా తెరిచాడు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ తొలి బంతికి జోరూట్ (3) ఎల్బీగా పెవిలియన్‌కు చేరగా, అదే ఓవర్‌లో ఐదో బంతికి బెయిర్ స్టో(38) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్(1), ఇయాన్ మోర్గాన్(1) పరుగుతో ఉన్నారు.


K Yadav

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ రెండో బంతికి ఓపెనర్ జేసన్ రాయ్(38) పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో(33), జోరూట్(1) పరుగుతో ఉన్నారు.


రెండు సార్లు ఔట్ కాకుండా తప్పించుకున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు
ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓపెనర్లు రెండుసార్లు ఔట్ కాకుండా తప్పించుకున్నారు. ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ చివరి బంతి జానీ బ్రిస్టో ప్యాడ్‌లకు తగిలింది. అయితే ఎల్బీగా కోసం బౌలర్ అపీల్ చేసినప్పటికీ.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు. అయితే ఇండియా కూడా అది లెగ్ వికెట్‌కి దూరంగా వెళ్తుందని భావించి రివ్యూ తీసుకోలేదు.

ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ వేసిన ఐదో ఓవర్‌లో జేసన్ రాయ్ బౌలర్‌కి ఓ వేగమైన క్యాచ్ ఇచ్చాడు. అయితే ఈ కష్టమైన క్యాచ్‌ని ఉమేశ్ పట్టుకొనేందుకు ప్రయత్నించాడు. . కానీ బంతిని అందుకోలేకపోయాడు. ఫలితంగా ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లు.. అలా ఔట్ అవ్వకుండా తప్పించుకున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోకుండా 47 పరుగులు చేసింది. క్రీజులో రాయ్(23), బ్రిస్టో(22) పరుగులతో ఉన్నారు.


దూకుడుగా ఆడుతోన్న ఇంగ్లాండ్ ఓపెనర్లు
ట్రెంట్ బ్రడ్జ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 5 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌-జానీ బెయిర్‌స్టోల జోడీ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో రాయ్‌ 8, బెయిర్‌స్టో 16 పరుగులతో ఉన్నారు.


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది.

వెన్ను నొప్పి నుంచి టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ కోలుకోకపోవడంతో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్టు కోహ్లీ పేర్కొన్నాడు. టాస్ గెలవడం మంచిదైందని అన్నాడు.

టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మణికట్టు స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నట్టు చెప్పాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ తొలుత బ్యాటింగ్ చేయడం మంచి అవకాశమని, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరోవైపు పక్కటెముకల గాయంతో తొలి వన్డేకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ దూరమైనట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు.

సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరిస్‌ను కైవసం చేసుకుని కోహ్లీసేన మంచి జోరుమీదుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులు, పిచ్‌లపై అంచనాకు వచ్చేందుకు కోహ్లీసేనకు ఇదో మంచి అవకాశం.

అయితే, వన్డేల్లో ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత తేలికేం కాదు. గత కొన్నేళ్లుగా వన్డేల్లో ఆతిథ్య జట్టుకు మంచి రికార్డు ఉంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత వన్డేల్లో మేటి రికార్డు ఇంగ్లాండ్‌దే. 46 వన్డేల్లో గెలిచిన ఆ జట్టు కేవలం 19 వన్డేల్లో మాత్రమే ఓటమిపాలైంది. మరోవైపు వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్లో క్రోయేషియా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో లండన్‌వాసులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే తొలి వన్డేలో విజయం సాధించి తమ దేశ క్రీడాభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని మోర్గానే సేన భావిస్తోంది. కాగా, మూడు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన వైట్ వాష్ చేస్తే ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంటుంది.

జట్ల వివరాలు:

టీమిండియా:
రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ధోని, పాండ్యా, కౌల్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్

ఇంగ్లాండ్:
జాసన్ రాయ్, జో రూట్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, అలీ, డేవిడ్ విల్లీ, ప్లంకెంట్, రషీద్, వుడ్

Story first published: Friday, July 13, 2018, 6:09 [IST]
Other articles published on Jul 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+