Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్న్ చేతిలో సచిన్ ఓటమి: 3-0తో సిరిస్ క్లీన్ స్వీప్

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజెల్స్‌‌లో జరిగిన క్రికెట్ ఆల్‌స్టార్స్ మూడో టీ20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని వార్న్ వారియర్స్ ఒక బంతి మిగిలుండగానే 5 వికెట్లను కోల్పోయి 224 పరుగులు సాధించింది.

వార్న్ జట్టులో వాగన్ డక్కౌట్ కాగా, హెడెన్ 12, సైమండ్స్ 31, జాంటీ రోడ్స్ 17, సంగక్కార 42, కలిస్ 49, పాంటింగ్ 43, వార్న్ 6 పరుగులు చేశారు. సచిన్ బ్లాస్టర్స్ టీములో స్వాన్ 2, ఆంబ్రోస్, హూపర్, సెహ్వాగ్ లు చెరో వికెట్ తీసుకున్నారు.

Sachin Blasters vs Warne Warriors

దీంతో మూడు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో వార్న్ వారియర్స్ జట్టు కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సచిన్ బ్లాస్టర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.

సచిన్‌ బ్లాస్టర్స్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌ 19వ ఓవర్‌ వేసిన మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో కలిస్‌ వరుసగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో వారియర్స్‌ లక్ష్యం 6 బంతుల్లో 8 పరుగులుగా నిలిచింది. వారియర్స్‌ 18.1 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 191 పరుగులు సాధించింది.

విజయానికి ఇంకా 11 బంతుల్లో 29 పరుగులుచేయాల్సి ఉంది. వారియర్స్‌ విజయానికి 13 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో ఉన్న కలిస్‌ వరుస బౌండరీలు బాదుతున్నాడు. ఆంబ్రోస్‌ బౌలింగ్‌లో కలిస్‌ వరుస బౌండరీలు బాదడంతో ప్రస్తుతం వారియర్స్‌ లక్ష్యం 15 బంతుల్లో 43 పరుగులుగా ఉంది.

Live Cricket Score of Sachin Blasters vs Warne Warriors, 3rd T20 at Los Angeles

మూడో టీ20 మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సచిన్‌ బ్లాస్టర్స్‌ 219 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో వార్న్‌ వారియర్స్‌ 15 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది.

220 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వార్న్‌ వారియర్స్‌ సంగక్కర వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడిన సంగక్కర (42) స్వాన్‌ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం వారియర్స్‌ విజయానికి 36 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది.

లాస్‌ ఏంజెల్స్‌‌లో సచిన్‌ బ్లాస్టర్స్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వార్న్‌ వారియర్స్‌ విజయానికి 64 బంతుల్లో 119 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. వారియర్స్‌ కీలకమైన హెడెన్‌ వికెట్‌ కోల్పోయింది.

జట్టు స్కోరు 52 వద్ద లేని పరుగు కోసం ప్రయత్నించిన హెడెన్‌ (12) లక్ష్మణ్‌ మెరుపు వేగంతో స్పందించి కీపర్‌ మొయిన్‌ ఖాన్‌కు బంతిని అందించడంతో రనౌట్‌గా వెనురిగాడు. 50 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడిన సైమండ్స్‌ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాల్ష్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ కోసం ప్రయత్నించి పెవిలియన్‌ చేరాడు.

220 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వార్న్‌ వారియర్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయింది. బ్లాస్టర్స్‌ బౌలర్‌ ఆంబ్రోస్‌ వేసిన బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన వాన్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఆల్ స్టార్ టి20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో వార్న్ వారియర్స్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. దీంతో వారియర్స్ జట్టుకు 220 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన సచిన్ బ్లాస్టర్స్ జట్టు ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీలు చెలరేగిపోయారు. కేవలం 25 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సచిన్ టెండూల్కర్ 50 పరుగులు సాధించాడు. దీంతో మైదానంలో సచిన్ టెండూల్కర్ రెచ్చిపోయి సిక్సులు, ఫోర్లు కొడుతుంటే అభిమానులు ఆనందంతో గంతులేశారు.


56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెట్టోరీ బౌలింగ్ లో స్టంపింగ్ రూపంలో అవుట్ అయి పెవీలియన్‌కు చేరాడు. మహేల అవుట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన గంగూలీ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 50 పరుగులు చేసి వెట్టోరీ బౌలింగ్ లో వెనుదిరగగా, హూపర్ 22 బంతుల్లో 33 పరుగులతో ఆకట్టుకున్నాడు.

వారియర్స్ బౌలర్లలో వెటోరి 3 వికెట్లు తీసుకోగా, సైమండ్స్, వాల్ష్ చెరో వికెట్ దక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను వార్న్ వారియర్స్ గెలుచుకుని సిరిస్‌ను కైవసం చేసుకుంది.

సచిన్ బ్లాస్టర్స్:

జట్టు: వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, మహేల జయవర్ధనే, కార్ల్ హూపర్, మొయిన్ ఖాన్, ముత్తయ్య మురళీధరన్, గ్రేమ్ స్వాన్, షాన్ పొల్లాక్, కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్గ్రాత్, లాన్స్ క్లూసెనర్.

వార్న్ వారియర్స్:

జట్టు: మాథ్యూ హేడెన్, మైకేల్ వాన్, రికీ పాంటింగ్, జాంటీ రోడ్స్, జాక్వెస్ కలిస్, ఆండ్రూ సైమండ్స్, కుమార్ సంగక్కర, సక్లైన్ ముస్తాక్ డేనియల్ వెట్టోరి, షేన్ వార్న్, కోర్ట్నీ వాల్ష్, వసీం అక్రం, అలన్ డొనాల్డ్, అజిత్ అగార్కర్

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+