Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా టెస్టు: గత ఏడేళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు, ఇదే తొలిసారి

Live cricket score, India vs Sri Lanka, 1st Test, Day 2: Rain holds up Pujara’s 50

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు భారత టాపార్డర్‌ను కుప్పకూల్చారు. ఈ టెస్టులో టీమిండియా కేవలం 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. తద్వారా కోహ్లీసేన ఓ చెత్త రికార్డుని నమోదు చేసింది.

ఏడేళ్ల తర్వాత భారత్ స్వదేశంలో 30 అంతకంటే తక్కువ పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. చివరిసారి 2010లో న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన టెస్టులో భారత్ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 17/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజైన శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్ కష్టాల్లో పడింది.

లంచ్ విరామానికి ముందే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నిలుస్తాడని నమ్మకం పెట్టుకున్న రహానె (4) జట్టు స్కోరు 30 వద్ద పెవిలియన్‌ చేరాడు. శ్రీలంక బౌలర్ షనకా వేసిన 17.2వ బంతికి పేలవ షాట్‌ ఆడి డిక్వెలాకు క్యాచ్‌ ఇచ్చాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి అశ్విన్ వచ్చాడు.

అశ్విన్ కూడా 26వ ఓవర్‌ చివరి బంతికి కరుణరత్నెకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. మ్యాచ్ పరిస్థితి చూస్తుంటే భారత్‌ను పుజారానే ఆదుకోవాలేమో అనిపిస్తోంది. మరోవైు వరుణుడు కూడా మ్యాచ్‌కి అడ్డంకిగా మారాడు.

దీంతో రెండో రోజు వర్షం రావడంతో ఆటను అంఫైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో టీ విరామం లేకుండానే భోజన విరామాన్ని ముందుకు తెచ్చారు. వర్షం వచ్చి మ్యాచ్‌ నిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం ఛటేశ్వర్ పుజారా (47) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి తోడుగా వృద్ధిమాన్‌ సాహా (6) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 12:54 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+