

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపించాడు. మొత్తం పరుగుల లక్ష్యం 205 కాగా అందులో సగానికి పైగా పరుగులు చేసి అలవోకగా సఫారీ జట్టుపై గెలిచారు. 8 వికెట్లు, 17 ఓవర్లకు పైగానే బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.
కోహ్లీ సెంచరీ: ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి, దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో సెంచరీతో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా 13వ వన్డే శతకాన్ని సాధించిన కోహ్లి.. అత్యధిక సెంచరీలు కొట్టిన ఓవరాల్ కెప్టెన్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(13), కోహ్లీ(13)లు రెండో స్థానంలో నిలవగా, కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన వారిలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్(22) అగ్రస్థానంలో ఉన్నాడు.
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదటి వికెట్‌గా రోహిత్ శర్మను 3వ ఓవర్లోనే కోల్పోయింది. ఐదో వన్డేలో సెంచరీ దాటి స్కోరు చేసిన రోహిత్ ఆఖరి వన్డేలో యథావిధిగా ముప్పైకి మించని స్కోరుతో 15పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఆడిన కాసేపటిలోనే రోహిత్ మూడు ఫోర్ బౌండరీలను సాధించడం విశేషం.
మరో ఓపెనర్ గా దిగిన ధావన్ 34బంతుల్లో (18) పరుగులు చేశాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ, 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు విరాట్. 23 ఓవర్లకే అతడి సెంచరీ అయిపోవడం విశేషం. ఆ వందలో 17 ఫోర్లుండటం గమనార్హం. సెంచరీ తర్వాత మరింత జోరు పెంచిన విరాట్ ఇంకో రెండు ఫోర్లు, రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. బౌండరీల రూపంలోనే అతను 106 పరుగులను చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
ఆఖరి మ్యాచ్ గెలవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశలపై భారత బౌలర్లు నీళ్లు చల్లారు. ఇప్పటికే ఆరు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకున్న టీమ్ ఇండియా ఆఖరి మ్యాచ్‌లోనూ అదే పోరాటం కొనసాగించింది. బౌలర్లకు ధీటుగా బ్యాట్స్‌మెన్‌లు అదే స్థాయిలో రెచ్చిపోయి ఆడారు. చెప్పాలంటే మ్యాచ్‌ను వన్ మాన్ షో గా చేసేశాడు కోహ్లీ.
మ్యాచ్ ఆరంభం నుంచే భారత బౌలర్లు సఫారీ జట్టును కట్టడి చేయడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా నిలకడగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లను పడగొట్టారు. బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 204పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 205లక్ష్యాన్ని నిర్దేశించినట్లయింది.
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లని భారత బౌలర్లు పోటీపడి పెవిలియన్‌కు పంపారు. సఫారీలు ఎంత ప్రయత్నించినా పరుగులు రాబట్టలేక తర్జనభర్జన పడ్డారు. నాలుగో వికెట్‌గా క్లాసెన్‌ను ఔట్ చేసిన బుమ్రా.. ఐదు బంతుల గ్యాప్‌లోనే మరో వికెట్‌ను పడగొట్టాడు. దీంతో భారత్ చేతికి ఐదు సఫారీ వికెట్లు చిక్కాయి.
ప్రస్తుత స్కోరు: 33 ఓవర్లకు గాను 139/5
సఫారీ జట్టు ప్రధాన వికెట్, స్టార్ బ్యాట్స్ మెన్ అయిన డివిలియర్స్‌ను సైతం కోల్పోయింది. 20.5 ఓవర్ వద్ద చాహల్ వేసిన బంతి నేరుగా వికెట్లను తాకి డివిలియర్స్‌ను పెవిలియన్‌కు పంపింది. ఇన్నింగ్స్ గాడిన పడ్డట్లే అనిపించింది. కానీ స్పిన్నర్ చాహల్ ఆ జట్టును గట్టి దెబ్బ తీశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఏబీని బోల్తా కొట్టించాడు. ఆపై జొండోను కూడా అతనే ఔట్ చేశాడు.
భారత జట్టులో మరో యువకెరటం మెరిసింది. స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌తో పాటుగా సఫారీలపై తొలిసారి అవకాశాన్ని అందుకున్న మరో బౌలర్ తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆరో వన్డేలో శార్దూల్ సఫారీ వికెట్లను పడగొట్టడానికి బోణి చేశాడు.
శార్దూల్ ఠాకూర్ పది ఓవర్లు పూర్తయ్యేసరికి సఫారీ జట్టు ప్రధాన రెండు వికెట్లను తీశాడు. 9.5 ఓవర్లకు మార్కరమ్ వికెట్‌ను శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో 24(30)స్కోరుతో ముగించాడు. 6.3 ఓవర్ల వద్ద హషీమ్ ఆమ్లా వికెట్‌ను 10(19) పరుగులు ఇచ్చి ధోనీ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.
ఇరు జట్ల గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు టాస్ కోసం ఇరు జట్లు పోటీపడగా టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. సఫారీ జట్టుతో సమరం 4:30 నిమిషాలకు మైదానంలో ప్రారంభమైంది.
ఆరో వన్డే: మ్యాచ్ స్కోరు కార్డు, పూర్తి వివరాలు
ఇప్పటికే 4-1తో సిరీస్‌ను దక్కించుకున్న భారత్ ఆరో వన్డే సైతం విజయంతో ముగించాలని తహతహలాడుతోంది. ఆఖరి వన్డే అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనే ప్రయత్నంలో సఫారీ జట్టు ఆరాటపడింది.
గతంలో ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను విరాట్ కోహ్లీ సాధించాడు. 1992 నవంబరు నుంచి ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో విజయం కావాలనే పాతికేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆరు వన్డేల సిరిస్‌ను మరో వన్డే మిగిలుండగానే 4-1తో కైవసం చేసుకుని సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది.
దీంతో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకుని సైతం పదిలం చేసుకుంది. ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డే శుక్రవారం సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే ఆరు వన్డేల సిరిస్‌ను సొంతం చేసుకున్న కోహ్లీసేన ఆఖరి వన్డేలో కూడా విజయం సాధించి అదిరిపోయే ముంగిపు ఇవ్వాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
భారత్:కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్
దక్షిణాఫ్రికా: అయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హషీమ్ ఆమ్లా, జేపీ డుమిని, డేవిడ్ మిల్లర్, ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కెల్, లుంగి ఎంగిడి, అండిలే ఫెలుక్‌వాయే, రబాడ, తబ్రైజ్ షంషీ, హెన్రిచ్ క్లాసెన్,