2nd T20I: అంఫైర్ వివాదాస్పద నిర్ణయం, విలియమ్సన్ అసంతృప్తి


హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా శుక్రవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ బౌలింగ్ చేసిన స్పిన్నర్ కృనాల్ పాండ్య బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ (1) బంతిని ముందుకు హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బ్యాట్‌కి సరిగా కనెక్ట్ అవ్వని బంతి నేరుగా వెళ్లి బ్యాట్స్‌మెన్ ఫ్యాడ్స్‌ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు.

బ్యాట్ ఎడ్జ్‌ని తాకిందని ధీమా
అయితే, బంతి బ్యాట్ ఎడ్జ్‌ని తాకిందని ధీమా వ్యక్తం చేసిన మిచెల్ డీఆర్ఎస్ నిర్ణయానికి వెళ్లాడు. టీవీ రిప్లైని పరిశీలించగా.. హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయితే, అది బంతి తాకడంతో వచ్చిన గుర్తు కాదని వెల్లడించిన థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే బాసటగా నిలిచాడు.
బంతి బ్యాట్‌ను తాకలేదని
బంతి బ్యాట్‌ను తాకలేదని రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ చెప్పడంతో ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అయితే, థర్డ్ అంఫైర్ నిర్ణయంపై న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మిచెల్‌తో పాటు అప్పుడు క్రీజులో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మిచెల్ మైదానం వీడకుండా
మిచెల్ మైదానం వీడకుండా ఫీల్డ్ అంపైర్‌తో చర్చిందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిర్ణయం వెల్లడించడంతో తాము వెనక్కి తీసుకోమని ఫీల్డ్ అంఫైర్లు స్పష్టం చేశారు. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మైదానంలోనే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మతో కాసేపు ఆ ఔట్ నిర్ణయంపై చర్చిస్తూ.. ఆ ఔట్ అప్పీల్‌ని వెనక్కి తీసుకోవాల్సిందిగా సూచించాడు.
17 ఓవర్లకు న్యూజిలాండ్ 136/5
ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా అంపైర్ నిర్ణయమే శిరోధార్యం అనే తరహాలో విలియమ్సన్‌కి సమాధానం ఇవ్వడంతో చివరకు మిచెల్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (31), శాంట్నర్(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications