900కు పైగా వన్డేలు ఆడిన జట్లివే! ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందెవరంటే.. భారత్ సంగతేంటి?

వన్డే క్రికెట్‌లో టీమిండియా ఆదివారం అరుదైన మైలురాయిని చేరుకోబోతుంది. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో ఆడబోయే వన్డే మ్యాచ్ ద్వారా వన్డే ఫార్మాట్లో 1000 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించబోతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఎక్కువ మ్యాచ్‌లు ఎవరు గెలిచారనే చర్చ ప్రస్తుతం మొదలైంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాల కోసం అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

900కు పైగా ఆడిన జట్లు ఇవే
భారత్ కంటే ముందు ఇతర జట్లు వన్డే క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ఎక్కువ మ్యాచ్‌లు మాత్రం టీమిండియానే ఆడింది. ఇప్పటివరకు భారత జట్టు మొత్తంగా 999 వన్డే మ్యాచ్‌లు ఆడింది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా ఎక్కువ వన్డేలు ఆడింది. ఆ జట్టు ఇప్పటివరకు 958 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత మూడో స్థానంలో 936 వన్డే మ్యాచ్‌లతో పాకిస్థాన్ ఉంది. ఇప్పటివరకు వన్డే క్రికెట్‌లో ఈ మూడు జట్లు మాత్రమే 900కు పైగా వన్డేలు ఆడాయి.

800కు పైగా వన్డేలు ఆడిన జట్లు ఇదిగో
ఇప్పటివరకు 870 వన్డే మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత 834 వన్డేలతో వెస్టిండీస్ ఐదో స్థానంలో ఉంది. ఇక 775 వన్డేలతో న్యూజిలాండ్ ఆరో స్థానంలో ఉండగా.. 761 వన్డే మ్యాచ్‌లతో ఇంగ్లండ్ ఏడో స్థానంలో ఉంది. 638 వన్డేలతో సౌతాఫ్రికా ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకు జింబాబ్వే 541 వన్డేలు, బంగ్లాదేశ్ 388 వన్డేలు, ఐర్లాండ్ 176, కెన్యా 154, ఆఫ్ఘనిస్థాన్ 132, స్కాట్లాండ్ 121 వన్డే మ్యాచ్‌లు ఆడాయి.

భారత్ ఎన్ని గెలిచిందంటే..
ఇప్పటివరకు అత్యధిక వన్డే మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో ఉంది. 999 వన్డేలు ఆడిన భారత్ 54 శాతం విజయాలతో 518 మ్యాచ్‌లు గెలిచింది. 9 మ్యాచ్‌లు టై కాగా.. 41 రద్దయ్యాయి. 431 మ్యాచ్‌ల్లో ఓడింది. కాగా అత్యధిక వన్డే మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ జట్టు 63 శాతం విజయాలతో 581 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 334 ఓడగా.. 9 టై అయ్యాయి. 34 రద్దయ్యాయి. 334 మ్యాచ్‌ల్లో ఓడింది.

విండీస్, పాక్, శ్రీలంక జట్లు ఎన్ని గెలిచాయి?
ఎక్కువ వన్డే మ్యాచ్‌లు గెలిచిన జాబితాలో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 53 శాతం విజయాలతో 490 వన్డే మ్యాచ్‌లు గెలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. విండీస్ 406 మ్యాచ్‌ల్లో, శ్రీలంక 395 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక సౌతాఫ్రికా 391 మ్యాచ్‌లు, ఇంగ్లండ్ 384 మ్యాచ్‌ల్లో విజయాలతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications