ప్ర‌పంచ‌క‌ప్ 2019: రికార్డుల‌న్నీ కొల్ల‌గొట్టేశాడు!

సౌతాంప్ట‌న్‌: మ‌్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడా ఆల్ రౌండ‌ర్‌. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో కొన‌సాగుతున్న ప్ర‌పంచ‌క‌ప్ మెగా టోర్న‌మెంట్‌లో రికార్డుల‌న్నీ కొల్ల‌గొట్టేస్తున్నాడు. ఇన్ని మ్యాచుల్లో బ్యాట్‌తో రాణించిన అత‌ను బంతితోనూ త‌న ప‌రాక్ర‌మాన్ని చూపాడు. 29 ప‌రుగుల‌కు అయిదు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. త‌న జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. అత‌నే- ష‌కీబ్ ఉల్ హ‌స‌న్‌. బంగ్లాదేశ్ ఆల్ రౌండ‌ర్‌. బంగ్లాబేబీగా ముద్ర‌ప‌డిన బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో కొద‌మ‌సింహంలా పోరాడుతోందంటే.. అందులో ష‌కీబ్ ఉల్ హ‌స‌న్ పాత్రే కీల‌కం.

 అర్ధ‌సెంచ‌రీతో అగ్ర‌స్థానానికి..

అర్ధ‌సెంచ‌రీతో అగ్ర‌స్థానానికి..

తాజాగా సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో బ‌ల‌హీన‌మైన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టుపై బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. సోమవారం ఆ జట్టు 62 పరుగుల తేడాతో నెగ్గింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జ‌ట్టు మొత్తం 50 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ష‌కీబుల్ హ‌స‌న్ ఈ మ్యాచ్‌లో మ‌రోసారి రాణించాడు. అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 69 బంతుల్లో ఒక ఫోర్ స‌హాయంతో 51 ప‌రుగులుచేశాడు. ముజీబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఎల్‌బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. అనంత‌ర బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘ‌న్ జ‌ట్టు 47 ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో అర్ధ‌సెంచ‌రీ సాధించిన ష‌కీబుల్‌.. బౌల‌ర్‌గా విశ్వ‌రూపాన్ని చూపాడు. 10 ఓవ‌ర్ల‌కు 29 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి అయిదు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు.

న‌వ్‌దీప్ షైనికి పిలుపు: హుటాహుటిన ఇంగ్లండ్ వెళ్లిన పేస్ బౌల‌ర్‌

అయిదు వికెట్లతో మ‌రో రికార్డు..

అయిదు వికెట్లతో మ‌రో రికార్డు..

ఈ మ్యాచ్‌లో ష‌కీబుల్ సాధించిన అర్ధ‌సెంచ‌రీ, ప‌డ‌గొట్టిన అయిదు వికెట్లు అత‌ణ్ని రికార్డుల్లోకి ఎక్కించాయి. అన్ని ప్ర‌పంచ‌క‌ప్ టోర్నమెంట్ల‌లో క‌లిపి బంగ్లాదేశ్ త‌ర‌ఫున వెయ్యి పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్ర‌స్తుత టోర్న‌మెంట్‌లో అత్యధిక ప‌రుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, రెండు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్ వ‌ర‌కు షకీబుల్‌ 476 ప‌రుగులు చేశాడు. 447 ప‌రుగల‌తో ఆస్ట్రేలియ‌న్ బ్యాట్స్‌మెన్ డేవిడ్‌ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్ప‌టిదాకా జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ల‌లో షకీబుల్ ఇప్ప‌టిదాకా చేసిన మొత్తం ప‌రుగులు 1016. ఈ ఫీట్ సాధించిన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ అత‌ను. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లపై సెంచ‌రీలు చేశాడు.

 బంగ్లా బౌల‌ర్ల బెస్ట్ బౌలింగ్

బంగ్లా బౌల‌ర్ల బెస్ట్ బౌలింగ్

సౌతాంప్ట‌న్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ష‌కీబుల్ హ‌స‌న్ త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 29 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి అయిదు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ఓపెన‌ర్లు గుల్బ‌దీన్ న‌బీ, రెహ్మ‌త్ షా, అస్ఘ‌ర్ ఆఫ్ఘ‌న్‌, మ‌హ‌మ్మ‌ద్ న‌బీ, న‌జీబుల్లా జ‌డ్ర‌న్ వికెట్ల‌ను తీసుకున్నాడు. దీనితో బంగ్లాదేశ్ త‌ర‌ఫున అయిదు వికెట్ల‌ను తీసుకున్న మొట్ట‌మొద‌టి బౌల‌ర్‌గా నిలిచాడు. 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఐర్లాండ్‌పై ష‌ఫీవుల్ ఇస్లాం నాలుగు వికెట్లు, 2007 ప్ర‌పంచ‌క‌ప్‌లో ముష్ర‌ఫీ మొర్తాజా టీమిండియాపై నాలుగు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో రుబెల్ హోస్సైన్ ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల‌నే తీసుకున్నాడు.

మూడో ఆట‌గాడు.. అత‌డే

మూడో ఆట‌గాడు.. అత‌డే

ఒక ప్ర‌పంచ‌క‌ప్‌లో సెంచ‌రీ చేసి, అయిదు వికెట్ల‌ను తీసుకున్న మూడో ఆట‌గాడు ష‌కీబుల్ హ‌స‌నే. ఇదివ‌ర‌కు ఈ ఘ‌న‌త‌ను ఇద్ద‌రు భార‌తీయ క్రికెట‌ర్లు సాధించారు. క‌పిల్‌దేవ్‌, యువ‌రాజ్ సింగ్‌.. వారిద్ద‌రే ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు. షాహిద్ అఫ్రిదీ, క్రిస్ గేల్ సెంచ‌రీలు చేసి, నాలుగు వికెట్లు తీసుకున్నారు. అయిదు వికెట్లు ప‌డ‌గొట్టి 29 పరుగులు మాత్ర‌మే ఇచ్చిన బెస్ట్ బౌలింగ్ ఫిగ‌ర్ కూడా ష‌కీబుల్‌కు ద‌క్కింది. ఇదివర‌కు యువ‌రాజ్ సింగ్ ఈ రికార్డును న‌మోదు చేశాడు. ఓ ప్ర‌పంచ‌క‌ప్‌లో 31 ప‌రుగులు ఇచ్చిన యువ‌రాజ్ సింగ్ అయిదు వికెట్లు తీసుకున్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 25, 2019, 7:44 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X