Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాగ్‌పూర్ టీ20లో 6 వికెట్లు: దీపక్ చాహర్ బద్దలు కొట్టిన రికార్డులివే!

List of records Deepak Chahar created with his 6-wicket haul against Bangladesh in Nagpur T20I

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ (62), కేఎల్ రాహుల్‌ (52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.

అనంతరం చేధనకు దిగిన బంగ్లాదేశ్ దీపక్‌ చాహర్‌ (6/7), శివమ్‌ దూబె (3/30) ధాటికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన దీపక్ చాహర్‌ అనేక వ్యక్తిగత రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం...

ఏకైక బౌలర్‌‌గా దీపక్ చాహర్‌

ఏకైక బౌలర్‌‌గా దీపక్ చాహర్‌

1 - అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్‌ తీసిన భారత ఏకైక బౌలర్‌‌గా దీపక్ చాహర్‌ నిలిచాడు. మొత్తం మీద 12వ బౌలర్‌. మహిళల వరల్డ్ టీ20 2012లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏక్తా బిస్త్ హ్యాట్రిక్ వికెట్లు సాధించింది.

1 - పురుషుల టీ20 క్రికెట్‌లో 6 వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్. టీ20ల్లో 6 వికెట్లు తీసిన నాలుగో పేసర్‌గా చాహర్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అంతకముందు బ్రెజిల్-అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పెడ్రో ఆర్ఘి(5/4) చేసిన ప్రదర్శన ఇప్పటివరకు అత్యుత్తమం.

చాహర్ అత్యుత్తమ ప్రదర్శన

చాహర్ అత్యుత్తమ ప్రదర్శన

6/7 - పురుషుల టీ20 క్రికెట్‌లో దీపక్‌ చాహర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన. అంతకముందు శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్‌ (6/8; 2012లో జింబాబ్వేపై) రికార్డును బద్దలు కొట్టాడు.

6/7 - భారత గడ్డపై టీ20ల్లో దీపక్ చాహర్ నమోదు చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటగాడు అల్జారి జోఫెస్(6/12) సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై నమోదు చేసిన గణాంకాలను అధిగమించాడు.

ఈ సిరిస్‌లో మొత్తం 8 వికెట్లు తీసిన చాహర్

ఈ సిరిస్‌లో మొత్తం 8 వికెట్లు తీసిన చాహర్

8 - బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో దీపక్ చాహర్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఒక ద్వైపాక్షిక సిరిస్‌లో ఓ భారత పేసర్ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే కావడం విశేషం. గతంలో సఫారీలతో జరిగిన ఓ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ నమోదు చేసిన 7 వికెట్ల రికార్డుని దీపక్ చాహర్ అధిగమించాడు. 2016లో శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో అశ్విన్ 9 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో ఓ భారత బౌలర్ ద్వైపాక్షిక సిరిస్‌లో పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే కావడం విశేషం.

34 - టీ20ల్లో 50 వికెట్లు తీసేందుకు చాహల్‌ ఆడిన టీ20 మ్యాచ్‌లు. టీమిండియా తరుపున చాహరే ఈ రికార్డుని కలిగి ఉన్నాడు.

Story first published: Monday, November 11, 2019, 13:55 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+