For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2008 to 2020: ఏ సీజన్‌లో ఏ జట్టు టైటిల్‌ కొట్టిందో తెలుసా.. టాప్‌లో ముంబై ఇండియన్స్!!

List of IPL Winners from 2008 to 2020, Mumbai Indians won five times
IPL 2021 Final : CSK Vs KKR ఆ లిస్ట్ లోకి వచ్చేది ఎవరో 2008 To 2020 IPL Winners || Oneindia Telugu

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎన్నో మలుపులు తిరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఎట్టకేలకు తుది అంకానికి చేరుకుంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) జట్లు దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ధోనీ కెప్టెన్సీనే ప్రధాన ఆయుధంగా 9వసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన సీఎస్‌కే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ ఫైట్‌కు సిద్ధమైంది కేకేఆర్.

ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు ఉన్నాయి. చెన్నై, కోల్‌క‌తా జ‌ట్ల‌లో ఐపీఎల్ 2021 విజేత ఎవ‌రో కొద్ది గంట‌ల్లోనే తేలనుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు జరిగిన 13 సీజ‌న్‌లలో ఏ జ‌ట్లు ట్రోఫీ గెలుచుకున్నాయో ఒక‌సారి చూద్దాం.

ఐపీఎల్ టోర్నీ 2008లో ప్రారంభమైంది. ప్రతిఏటా జరుగుతున్న ఈ మెగా టోర్నీ.. ఇప్పటివరకు 13 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. మరో సీజన్ కూడా ఈరోజు పూర్తవనుంది. ఇక 13 సీజన్లలలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ ఎగరేసుకుపోయింది. ముంబై తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మూడు సీజన్లలో టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, టైటిల్ పట్టింది.

రాజస్థాన్ రాయల్స్, దక్కన్ చార్జర్స్‌ (ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కోసారి టైటిల్ గెలిచి విజేతగా నిలిచాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఇక 14వ సీజ‌న్‌లో చెన్నై, కోల్‌కతా టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు మరోమారు కప్‌ను ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి. ఐపీఎల్ 2021 విజేత ఎవ‌రో ఈరోజు తేలనుంది.

2008:

తొలి ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్‌ల్లో తలపడ్డాయి. చెన్నైను ఓడించి రాజస్థాన్ ఐపీఎల్‌ తొలి టైటిల్ గెలుచుకుంది.‌

2009:
రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్కన్ చార్జర్స్ ఫైనల్‌కు వెళ్లాయి. బెంగళూరును ఓడించిన చార్జర్స్ టైటిల్ కైవసం చేసుకుంది.

‌2010:
మూడో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడ్డాయి. ముంబైని ఓడించిన చెన్నై తొలి టైటిల్‌ను గెలుచుకుంది.

2011:
నాలుగో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు ఫైనల్‌కు వెళ్లాయి. బెంగళూరు చిత్తుచేసిన చెన్నై రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది.

2012:
ఐదవ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. వరుసగా మూడోసారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొడదామకున్న చెన్నైకి కోల్‌కతా షాకిచ్చింది. దాంతో కోల్‌కతా తొలిసారి కప్ కైవసం చేసుకుంది.

‌2013:
ఆరో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడ్డాయి. ఈసారి కూడా చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైని ఓడించి ముంబై తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది.

2014:
ఏడవ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ తుది పోరులో తలపడగా.. కేకేఆర్ విజయాన్ని అందుకుంది. దాంతో రెండోసారి కోల్‌కతా కప్ కైవసం చేసుకుంది.

2015:
ఎనిమిదవ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్ రెండోసారి షాకిచ్చింది. చెన్నైని ఓడించి రెండోసారి ముంబై టైటిల్ దక్కించుకుంది.‌

2016:
తొమ్మిదో సీజన్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో తలపడ్డాయి. బెంగళూరును ఓడించిన హైదరాబాద్‌ తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.‌

2017:
పదవ సీజన్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ ఫైనల్లో తలపడగా.. ముంబై గెలిచింది. దీంతో ముంబై మూడోసారి ఐపీఎల్ కప్ అందుకుంది.

2018:
పదకొండవ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో తలపడ్డాయి. ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్ గెలుచుకుంది.

2019:
పన్నెండవ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య మరోసారి ఫైనల్ పోరు జరగ్గా.. ముంబై విజయం సాధించింది. దాంతో నాలుగోసారి ముంబై కప్ కైవసం చేసుకుంది.

2020:
పదమూడవ సీజన్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ఫైనల్లో ఢీ కొనగా.. ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. దాంతో ఐదోసారి ముంబై కప్ గెలుచుకుంది.

Story first published: Friday, October 15, 2021, 15:00 [IST]
Other articles published on Oct 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+