ఐపీఎల్‌లో అత్యధిక డాట్‌బాల్స్ విసిరింది వీరే


ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) అంటేనే క్రీజులోకి వచ్చిన ప్రతీ ఆటగాడు చెలరేగి ఆడుతారు. బౌలర్ ఎంత మంచి బంతి వేసినా దాన్ని బాదాలనే కసి ఉంటుంది. మొత్తానికి ఐపీఎల్ అంటే బ్యాటర్ల ఆట. మరోవైపు బౌలర్ మాత్రం వికెట్ తీయాలని చూస్తుంటాడు. ఇది సాధ్యం కాకపోయినా.. కనీసం పరుగులు ఇవ్వకుండా డాట్‌బాల్స్ వేసేందుకు ప్రయత్నిస్తారు.
అయితే ఇప్పటి వరకు (ఐపీఎల్- 12వ సీజన్) చాలా మంది బౌలర్లు డాట్‌బాల్స్ విసిరారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే.. టీమిండియాకు ఆడిన వారే ఎక్కువ మంది ఉన్నారు. లంక బౌలర్ లసిత్ మలింగ మాత్రం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

హర్భజన్ సింగ్:
జట్టు: చెన్నై సూపర్ కింగ్స్
మ్యాచ్‌లు: 151
ఓవర్లు: 526.2
డాట్ బాల్స్: 1,153
పరుగులు : 3,705
ఎకానమీ: 7.03

ప్రవీణ్ కుమార్
జట్టు: గుజరాత్ లయన్స్ (రిటైర్)
మ్యాచ్‌లు: 119
ఓవర్లు: 420.4
డాట్ బాల్స్: 1075
పరుగులు: 3,251
ఎకానమీ: 7.72

లసిత్ మలింగ
జట్టు: ముంబయి ఇండియన్స్
మ్యాచ్‌లు: 112
ఓవర్లు: 433.2
డాట్ బాల్స్: 1071
పరుగులు: 2,999
ఎకానమీ: 7.41

అమిత్ మిశ్రా
జట్టు: దిల్లీ క్యాపిటల్స్
మ్యాచ్‌లు: 138
ఓవర్లు: 484.5
డాట్ బాల్స్: 1,046
పరుగులు: 3,596
ఎకానమీ: 7.41

పియూష్ చావ్లా
జట్టు: కోల్‌కతా నైట్‌రైడర్స్
మ్యాచ్‌లు: 147
ఓవర్లు: 486.1
డాట్ బాల్స్: 1,041
పరుగులు: 3,758
ఎకానమీ: 7.72

రవిచంద్రన్ అశ్విన్
జట్టు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్
మ్యాచ్‌లు: 129
ఓవర్లు: 448.2
డాట్ బాల్స్: 995
పరుగులు: 3,034
ఎకానమీ: 6.76

భువనేశ్వర్ కుమార్
జట్టు: సన్‌రైజర్స్ హైదరాబాద్
మ్యాచ్‌లు: 105
ఓవర్లు: 387.2
డాట్‌బాల్స్: 980
పరుగులు: 2810
ఎకానమీ: 7.25
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications