ఇండియా Vs ఇంగ్లాండ్: రికార్డులు ఏం చెబుతున్నాయి?


హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు రికార్డు ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. స్వదేశంలో జరిగే టెస్టు సిరిస్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసే టీమిండియా, ఉపఖండం బయట మాత్రం తేలిపోతూ ఉంటుంది.
ఇదే ఇంగ్లాండ్ జట్టు విజయంలోనూ జరిగింది. స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో ఇంగ్లీష్ టీమ్‌పై ఆధిపత్యం ప్రదర్శన ఇండియా.. ఇంగ్లాండ్‌లో మాత్రం తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మరే ఇతర జట్టుతో ఆడనన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఇంగ్లాండ్ జట్టుతోనే ఆడటం విశేషం.
ఇంగ్లాండ్ జట్టుతో మొత్తం టీమిండియా 117 టెస్టుల్లో తలపడింది. ఇందులో ఇంగ్లాండ్ వేదికగా 57 టెస్టులాడిన టీమిండియా కేవలం 6 టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు టెస్ట్‌ల్లో మిగతా జట్లతో పోల్చుకుంటే ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయశాతం చాలా తక్కువగా ఉండటం విశేషం.

1932లో తొలి టెస్ట్ సిరీస్ ఆడిన ఇండియా-ఇంగ్లండ్
1932లో తొలి టెస్ట్ సిరీస్ ఆడిన ఇండియా-ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు 32 టెస్ట్ సిరీస్‌ల్లో పోటీపడ్డాయి. ఈ 32 టెస్ట్ సిరీస్‌ల్లో ఇంగ్లాండ్ 18 సిరీస్ విజయాలను నమోదు చేయగా, ఇండియా 10 సిరీస్ విజయాలు నమోదు చేసింది. ఇక ఇంగ్లాండ్ వేదికగా ఇరు జట్లు 17 సార్లు టెస్ట్ సిరీస్‌ల్లో పోటీపడ్డాయి.

భారత్‌లో ఇరు జట్లు 15 టెస్ట్ సిరీస్‌లు ఆడాయి
13 సార్లు ఇంగ్లాండ్ సిరీస్ విజయాలు సాధించగా... 3 సార్లు భారత్ ఆతిధ్య జట్టును ఓడించింది. ఒక్క సిరీస్ మాత్రమే డ్రాగా ముగిసింది. భారత్‌లో ఇరు జట్లు 15 టెస్ట్ సిరీస్‌ల్లో తలపడ్డాయి. 7 సిరీస్‌ల్లో భారత్ విజయం సాధించగా 5 సార్లు ఇంగ్లాండ్ సిరీస్ విజేతగా నిలిచింది. ఇందులో 3 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.

టెస్టుల్లో ఇండియాపై ఇంగ్లండ్‌దే పైచేయి
ఏ రకంగా చూసినా... టెస్టుల్లో ఇండియాపై ఇంగ్లండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు ఇండియా-ఇంగ్లాండ్ 117 టెస్ట్‌ల్లో పోటీపడగా... ఇంగ్లాండ్ 43 టెస్ట్‌ల్లో విజయం సాధించింది. టీమిండియా కేవలం 25 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. 49 టెస్ట్‌లు డ్రాగా ముగిశాయి.

భారత వేదికగా ఇరు జట్లు 60 మ్యాచ్‌ల్లో
ఇక, ఇంగ్లీషు గడ్డపై ఇరు జట్లు 57 మ్యాచ్‌ల్లో పోటీపడ్దాయి. ఇంగ్లాండ్ 30 టెస్ట్‌ల్లో విజయం సాధించగా... ఇండియా 6 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 21 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత వేదికగా ఇరు జట్లు 60 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... ఇంగ్లాండ్ 13 టెస్టుల్లో నెగ్గింది. 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications