Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లిసా స్థలేకర్.. బంపర్ ఆఫర్: మొట్టమొదటి మహిళా ఛైర్‌పర్సన్‌గా అపాయింట్

Lisa Sthalekar has become the first woman to be appointed as president of the FICA

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా మహిళా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ లిసా స్థలేకర్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఫీకా) అధ్యక్షురాలిగా అపాయింట్ అయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక అసోసియేషన్‌కు ఓ మహిళ.. అధ్యక్షురాలిగా నియమితులు కావడం ఇదే తొలిసారి. స్విట్జర్లాండ్‌లోని న్యోన్‌లో నిర్వహించిన ఫీకా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సభ్యులు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు.

భారత్ అండర్ 19 క్రికెటర్, ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన విక్రమ్ సోలంకి ప్రస్తుతం ఫీకా అధ్యక్షునిగా పని చేస్తోన్నారు. ఆయన స్థానంలో లిసా స్థలేకర్ ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అసోసియేషన్‌ సారథ్య బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల స్థలేకర్ స్పందించారు. తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో పురుషులతో సమానంగా మహిళా ప్లేయర్లకు గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని, దీనికోసం తాను కృషి చేస్తానని చెప్పారు.

క్రికెట్‌ను గ్లోబల్ గేమ్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదివరకంటి కంటే ఇప్పుడు పలు కొత్త దేశాలు క్రికెట్ ఆడుతున్నాయని గుర్తు చేశారు. స్కాట్లాండ్, నెదర్లాండ్స్, నేపాల్, పపువా న్యూగినియా, బహ్రెయిన్ వంటి పలు దేశాలు కొత్తగా క్రికెట్‌లో అడుగు పెట్టాయని చెప్పారు. దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తాను ప్రయత్నాలు చేస్తానని లిసా స్థలేకర్ హామీ ఇచ్చారు.

2001 నుంచి 2013 వరకు లిసా స్థలేకర్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 2013లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళా ప్రపంచకప్ టోర్నమెంట్‌ను గెలిచిన ఆసీస్ జట్టులో ఆమె సభ్యురాలు కూడా. ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు, 125 వన్డే, 54 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడారు. 2005లో దక్షిణాఫ్రికా, 2010లో వెస్టిండీస్‌లో నిర్వహించిన ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లల్లో ఆస్ట్రేలియా తరఫున మెరుపులు మెరిపించారు.

Story first published: Tuesday, June 21, 2022, 16:09 [IST]
Other articles published on Jun 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+