ముంబై: బాలీవుడ్ నటి ప్రీతిజింతాకు కోపమొచ్చింది. భారత క్రికెట్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌తో డేటింగ్ వార్తల పైన ఆమె మండిపడ్డారు. ఆమె ట్విట్టర్‌లో స్పందించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నాకు అత్యంత దారుణంగా అనిపిస్తున్నాయని పేర్కొంది.

యువరాజ్, ప్రీతి జింటా రిలేషన్ షిప్‌లో ఉన్నారని రాసే రాతలకు దయచేసి దూరంగా ఉండాలని కోరింది. డియర్ మీడియా మీకు ఎన్నిసార్లు చెప్పాలి.. నేను ఎప్పుడు డేట్ చేయలేదని పేర్కొంది. యువరాజ్ సింగ్‌తో డేటింగ్ చేయాలనకుంటున్నానని కూడా చెప్పలేదని పేర్కొంది.
గతంలో వ్యాపారవేత్త నెస్ వాడియాతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. అనంతరం గత ఏడాది ఐపీఎల్ సమయంలో వివాదం చెలరేగింది. అనంతరం కేసు పెట్టింది. ఇప్పుడు యువరాజ్ సింగ్‌తో డేటింగ్ వార్తల పైన ఆమె భగ్గుమంది.