Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోహ్లీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది'

Like Sir Richards, Kohli will learn to calm down, says Holding

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలోని భారత జట్టుకు రెండు టెస్టుల్లోనూ వైఫల్యాలు ఎదురుకావడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలకు గురైయ్యాడు. అంతేగాక, ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన కోహ్లీ 'ఒకవేళ సిరీస్‌ మేం గెలిచి ఉంటే అత్యుత్తమ తుది జట్టు అన్న ప్రస్తావన వచ్చేదా?, ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు. మైదానంలో దిగితే తెలుస్తుంది. ఇకపై జట్టును మీరే సెలక్ట్‌ చేయండి. మేం ఆడతాం' అంటూ ధ్వజమెత్తాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన కంటే కూడా కోహ్లి దూకుడుపైనే ఎక్కువ చర్చ నడిచింది. ప్రధానంగా రెండు టెస్టులో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోహ్లి టెంపర్‌ కోల్పోవడం చర్చకు తెరలేపింది. ఇప్పుడు ఆ జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ మైకేల్‌ హోల్డింగ్‌ కూడా చేరిపోయాడు.

'భారత జట్టుకు కోహ్లి ఒక యువ కెప్టెన్‌. అతను ఇంకా కెప్టెన్‌గా ఎలా వ్యవహరించాలో నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఒకొసారి కొద్దిపాటి ఎమెషనల్‌కు గురయ్యే కోహ్లి... మరికొన్ని సందర్బాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తాడు. ఇక్కడ మా జట్టు మాజీ కెప్టెన్‌ సర్‌ రిచర్డ్స్‌ను చూసి కోహ్లి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బ్యాటింగ్‌ పరంగా కాదు. సారథిగా మాత్రమే ఇద్దర్నీ పోల్చుతున్నా.' అంటూ విమర్శలకు దిగాడు.

'రిచర్డ్స్‌ విండీస్‌ పగ్గాలు తీసుకున్నసమయంలో తన పదవికి క్రమేపీ న‍్యాయం చేసుకుంటూ వెళ్లాడు. అతను ఎంతో కూల్‌గా జట్టును ముందుకు తీసుకెళ్లేవాడు. ఆ క్రమంలోనే జట్టు కూడా నిలకడైన ప్రదర్శనతో ముందుకెళ్లేది. విరాట్‌ పదేపదే జట్టును మారుస్తూ ఉంటాడు. ప్రతీ మ్యాచ్‌కు జట్టును మార్చడంలో వల్ల సరైన ఫలితాలు రావు. ఈ విధానం వల్ల ఆటగాళ్లలో ఏకాగ్రత దెబ్బతింటుంది. చివరకు ఆడాలా? వద్దా? అనే సందిగ్థత ఆటగాళ్లలో వస్తుంది.' అంటూ గేలి చేశాడు.

'తుది జట్లలో మార్పులు అవసరమే.. కానీ మ్యాచ్‌ మ్యాచ్‌కు అవసరం లేదు. ఒకసారి అత్యుత్తమ టెస్టు జట్లను పరిశీలించు. అవి ఎలా సక్సెస్‌ అయ్యాయో చూడు. రిచర్డ్స్‌ వంటి దిగ్గజ కెప్టెన్లను చూసి కామ్‌గా ఉండటం కోహ్లి నేర్చుకుంటే మంచిది. ఎప్పుడైనా కెప్టెన్‌గా నీకు ఎదురైన ప్రశ‍్నను డిఫెన్స్‌ చేసుకోవాలి.. అంతేకానీ ఎదురుదాడి చేయకూడదు' అని హోల్డింగ్‌ పేర్కొన్నాడు.

'విరాట్ కెప్టెన్సీ జట్టులో ఎవర్ని ప్రభావితం చేయకపోగా చిక్కులు తెచ్చిపెడుతుంది. కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చి ఈ గడ్డపై పరుగులు తీసి చూపించాలి. అప్పుడు తన పేరును నా పేరు పక్కన పెట్టుకుంటా.' అంటూ కోహ్లీకి సవాలు విసిరాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 18:06 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+