గంగూలీకి 4 స్టెప్పుల్లో విషెస్:
అందరికన్నా టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వినూత్నంగా గంగూలీకి శుభాకాంక్షలు తెలిపారు. శబ్దం రాకుండా ఎంజాయ్ చేయండి. ఎవరూ చూడకుండా దాదా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ బర్త్ డే గంగూలీ.
స్టెప్-1: లేవండి. మీ రెండు కళ్లు ఒకసారి ఆర్పండి. ట్రాక్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేయండి.
స్టెప్-2: ప్రేక్షకులు ఉండగానే బౌలర్‌ను ఉతికి ఆరేయండి.(హింసకు తావులేకుండా)
స్టెప్-3: బంతిని మాత్రమే కాదు, మీ తలను, మీ హృదయాన్ని స్వింగ్ చేయండి.
స్టెప్-4: ఎవరూ చూడటం లేదన్న అమితానందంతో ఓ గొప్ప వ్యక్తిలా సంబరాలు చేసుకోండి.
ఇండియన్ స్టార్ కెప్టెన్‌కు
424 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 18,575పరుగులు, 132వికెట్లు 46వ పడిలోకి అడుగు పెడుతున్న ఇండియన్ స్టార్ కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు.
-ఐసీసీ
మాజీ కెప్టెన్‌కి పుట్టిన రోజు
టీమిండియా మాజీ కెప్టెన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
-బీసీసీఐ
దాదాకు హ్యాపీ బర్త్ డే
నేను స్ఫూర్తిగా తీసుకునే వ్యక్తుల్లో ఒకరైన దాదాకు హ్యాపీ బర్త్ డే. ఇండియన్ క్రికెట్‌ను మార్చేసిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ జీవితమంతా గొప్పగా ఉండాలి.
- మహమ్మద్ కైఫ్
చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎప్పుడూ హ్యాపీగా
గంగూలీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి.
- వీవీఎస్ లక్ష్మణ్
డాడీ, నీ కుటుంబ సభ్యులను
పుట్టిన రోజు శుభాకాంక్షలు డాడీ, నిన్ను, నీ కుటుంబ సభ్యులను దేవుడు చల్లగా చూడాలి.
-మనోజ్ తివారి
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకరైన
ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఒకరైన దాదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ దూకుడుని, అభిరుచిని అందుకోవడం చాలా కష్టం.
-ఆర్పీ సింగ్


Click it and Unblock the Notifications












