Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో టిక్‌టాక్.. కొడుకుతో కలిసి గబ్బర్ హల్చల్!!

Like Father, Like Son: Shikhar Dhawans Dance Video With Son

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ సమయాన్ని అందరిలానే టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భార్య అయేషా, కొడుకు జొరావర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో, ఫొటోలు గబ్బర్ సోషల్ ‌మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నాడు.

టిక్‌టాక్ వీడియో

టిక్‌టాక్ వీడియో

లాక్‌డౌన్‌ మొదటలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ వరుస టిక్‌టాక్ వీడియోలు చేయగా.. ఇప్పుడు శిఖర్ ధావన్, ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేస్తున్నారు. ఈ ఇద్దరు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా గబ్బర్ తన కొడుకు జొరావర్‌తో కలిసి టిక్‌టాక్ చేసాడు. బాలీవుడ్‌లోని ఓ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ టిక్‌టాక్ వీడియో చేశాడు. మొదటగా ధావన్ ఓ పాటకు డాన్స్ చేస్తుండగా.. మధ్యలో జొరావర్ రాగానే మరో సాంగ్ వచ్చింది. ఇలానే రెండు చేసి.. చివరకు ఇద్దరు కలిసి ఒకే పాటకు డాన్స్ చేసారు.

తండ్రీ కొడుకులు..

తండ్రీ కొడుకులు..

డాన్స్ చేసిన వీడియోను శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డ్యాన్స్‌లో అసలైన జోడీ అని వీడియోకు కాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కేంటీల వర్షం కురిపిస్తున్నారు. ధావన్ ఇటీవల తన కొడుకు జొరావర్‌తో కలిసి ఇంట్లోనే రెజ్లింగ్‌లో పోటీపడిన విషయం తెలిసిందే. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 136 వన్డేలు 61 టీ20లు ఆడాడు.

చేతి వేలి గాయం కారణంగా..

చేతి వేలి గాయం కారణంగా..

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.

View this post on Instagram

Dance ki asli jodi 😄😄 Like father, like son! #tiktok

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

Story first published: Wednesday, May 20, 2020, 13:48 [IST]
Other articles published on May 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+