

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ధోనీ కుమార్తె.. జీవా బాగా ఫేమస్ అయిపోయింది. దాదాపు సెలబ్రిటీ హోదా వచ్చేసింది. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్‌లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా ధోని నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలోనే ధోనీ.. అతని ముద్దుల కూతురు కలిసి కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ అయింది.
ఈ క్యూటెస్ట్ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిలో కూడా జీవా.. మరోసారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. ధోని, కూతురు జీవా ఇద్దరూ కూడా తమ తమ గాడ్జెట్లలో మునిగిపోయిన పిక్చర్ అది. ఓ హోటల్‌లో కూర్చుని ఉన్న వీరిద్దరూ.. చుట్టుపక్కల పరిసరాలన్నింటిన్నీ పట్టించుకోకుండా గాడ్జెట్లకు అతుకుపోయారు. ధోని తన ఐప్యాడ్‌ను వాడుతుండగా.. ఈ బుల్లి జీవా కూడా తన చిన్న ఐప్యాడ్‌ను తీసుకుని ఎంతో శ్రద్ధగా గమనిస్తూ కనిపించింది.
ఈ పిక్చర్‌లో ధోని తన ట్రైనింగ్ జెర్సీ వేసుకుని కనిపించాడు. అంటే ఈ పిక్చర్ ఇటీవల సిరీస్ మ్యాచ్‌ల సమయంలో తీసిందేనని తెలిసింది. వారి టేబుల్‌పై టీ కప్పులు, సూప్ బౌల్స్ వంటివి ఉన్నాయి. ట్విటర్‌లో షేర్ అయిన ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ వివాహంలో కూడా జీవా తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేసింది. ముద్దుముద్దుగా జీవా వేసిన స్టెపులపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు.
గతంలో కూడా జీవాకి సంబంధించిన వీడియోలని ధోని, సాక్షిలు ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం, అవి కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారడం సంగతి తెలిసిందే. ఇక ధోనీ కూడా చాలా సందర్భాల్లో జీవా ధోనీ గురించి మాట్లాడుతూ.. తను చాలా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తుందని.. తన మాటలు కూడా అలానే ఉంటాయని చెప్పాడు. అప్పుడప్పుడు తను మాట్లాడే మాటలు కూడా తనలోని భిన్నమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుందని అన్నాడు.