
పిచ్ ఎలా ఉంటుంది?
బే ఓవల్ మైదానంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకే సహకారం అందిస్తుంది. అంటే బౌలర్లకు ఏమాత్రం సహకారం ఉండదని కాదు. బ్యాటర్లు పరిస్థితులను చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే ఇక్కడ చివరగా జరిగిన రెండు అంతర్జాతీయ టీ20ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. దీంతో భారత్, న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో కూడా అలాంటి ఫలితమే ఆశించొచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు కేవలం 145 మాత్రమే కావడం గమనార్హం.

వాతావరణ శాఖ ఏం చెప్తోంది?
ఈ ప్రాంతంలో కూడా మ్యాచ్ సమయంలో ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. బే ఓవల్ ప్రాంతంలో లైట్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఈ వార్త విన్న అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. టీ20ల్లో భారత జట్టు భవిష్యత్తు నిర్ణయించడానికి ఈ సిరీస్ కీలకమని అంతా అనుకుంటున్నారు. అలాంటి సిరీస్ ఇలా వర్షం కారణంగా జరగకపోతే ఎలా? అని ఆందోళన చెందుతున్నారు.

తొలి మ్యాచ్ వర్షార్పణం
ఈ టీ20 సిరీస్‌లో భాగంగా జరడాల్సిన తొలి మ్యాచ్ కూడా వర్షానికి బలైంది. వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన ఆ మ్యాచ్‌లో కనీసం టాస్ కూడా పడలేదు. వర్షం ఏ కోశానా పూర్తిగా ఆగలేదు. అవుట్ ఫీల్డ్ ఆరబెట్టే సమయం కూడా సిబ్బందికి దక్కలేదు. దీంతో చాలా సేపు ఎదురు చూసిన ఫ్యాన్స్.. చివరకు మ్యాచ్ రద్దవడంతో చాలా నిరాశ పడ్డారు. ఈ క్రమంలోనే షెక్ హ్యాండ్ ఇచ్చుకున్న హార్దిక్ పాండ్యా, కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఆడకుండానే వెనుతిరిగారు.

సెమీస్ ఓటమి తర్వాత తొలి మ్యాచ్
ప్రపంచకప్‌లో అద్భుతంగా పోరాడి సెమీఫైనల్ చేరిన భారత్, న్యూజిల్యాండ్ జట్లు రెండూ.. నాకౌట్ మ్యాచులో పోరాటం చూపించలేక వెనుతిరిగాయి. పాకిస్తాన్ చేతిలో కేన్ విలియమ్సన్ టీం, ఇంగ్లండ్ చేతిలో రోహిత్ సేన ఘోరంగా ఓడిపోయాయి. ఈ ఓటమి బాధను పూర్తిగా మర్చిపోకముందే కివీస్ టూర్ ప్రారంభమైపోయింది. మరి ఈ టోర్నీలో పాండ్యా నాయకత్వంలోని జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications
